MLA Roja: దిగజారుడు రాజకీయాలు మానండంటూ పుత్తూరులో ఎమ్మెల్యే రోజా ఆగ్రహావేశం
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు జోరుగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో రోజా నిరసన కార్యక్రమంలో
YSRCP MLA Roja: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు జోరుగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర కూడలిలోని వైయస్సార్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రోజా నగరంలో నిరసన ర్యాలీ తీశారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఈ సందర్బంగా రోజా మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి పనులు మానండంటూ ఆమె ప్రతిపక్షపార్టీకి సలహా ఇచ్చారు.
ఇలా ఉండగా, టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇవాళ నిరసన హోరు కొనసాగిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపడుతున్నారు. నెల్లూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారిని నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగాలన్న చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎంపీ పాల్గొన్నారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో రెండ్రోజుల పాటు “జనాగ్రహ దీక్షలు” నిర్వహిస్తున్నట్లు ఎంపీ చెప్పారు.