Tirumala: ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు.. కోతకు గురైన రహదారి.. నిలిచిపోయిన వాహనాలు

తిరుపతి, తిరుమలలో కురస్తున్న వర్షాలకు ఘాట్‌ రోడ్డులో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రహదారి కోతకు గురైంది

Tirumala: ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు.. కోతకు గురైన రహదారి.. నిలిచిపోయిన వాహనాలు
Follow us

|

Updated on: Dec 01, 2021 | 7:11 AM

తిరుపతి, తిరుమలలో కురస్తున్న వర్షాలకు ఘాట్‌ రోడ్డులో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రహదారి కోతకు గురైంది. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద భారీగా చీలికలు ఏర్పడ్డాయి. భాష్యకార్ల సన్నిధికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలైనంతవరకు త్వరగా రహదారికి మరమ్మతులు నిర్వహించి భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నారు.

కాగా ఇటీవల తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రెండు ఘాట్‌ రోడ్లలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో కూడా తిరుమలకు రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి . ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పోయాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల లో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read:

AP Floods: తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన విజయసాయి రెడ్డి

Andhra Pradesh: సమ్మె సైరన్ మోగించిన ఏపీ జూడా అసోసియేషన్.. నేటి నుంచి నిరసన కార్యక్రమాలు..

Andhra Pradesh Govt News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..!