Sri Krishnadevaraya statue : శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టాలా వద్దా..? ర్యాలీ తీయాలా వద్దా? చిత్తూరు జిల్లా కుప్పంలో కాకరేపుతోన్న వివాదం
విగ్రహం పెట్టాలా వద్దా.. ర్యాలీ తీయాలా వద్దా? చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ విగ్రహ వివాదమే కాకరేపుతోంది. పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టేందుకు కాపు సామాజిక వర్గ నేతలు..
Sri Krishnadevaraya statue : విగ్రహం పెట్టాలా వద్దా.. ర్యాలీ తీయాలా వద్దా? చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ విగ్రహ వివాదమే కాకరేపుతోంది. పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టేందుకు కాపు సామాజిక వర్గ నేతలు నిర్ణయించుకున్నారు. ర్యాలీగా వెళ్లి మరీ విగ్రహ ప్రతిష్టాపన చెయ్యాలనుకున్నారు. కానీ పోలీసులు నో పర్మిషన్ అనేశారు. ఆపితే మాత్రం మేం అగుతామా.. ర్యాలీ తీస్తాం విగ్రహం పెడతాం అంటూ బీష్మించడంతో .. రాత్రి నుంచి కాపు నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. కొందర్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారు.
ప్రస్తుతం కుప్పంలో 144 సెక్షన్ అమలవుతోంది. ఎక్కడ చూసినా పోలీసులే మోహరించారు. ప్రతీష్టకు సిద్ధంగా ఉన్న రాయలవారి విగ్రహం, అందుకు ఆహ్వానిస్తున్న ఫ్లెక్సీ, విగ్రహం కోసం నిర్మించిన దిమ్మె అన్నీ సర్వసన్నద్ధం చేసుకున్నారు. అయితే, ఈ టైమ్‌లో ర్యాలీకి పర్మిషన్ లేదన్న పోలీసుల మాటతో కాపు నేతల్లో కాకరేగింది. ఎందుకు ఆపుతారంటూ నిలదీశారు. ఈ వాగ్వాదం చూస్తుంటే ర్యాలీ తీస్తారనే ఉద్దేశంతో పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ పెట్టి ఎక్కడి వాళ్లను అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు.
కావాలనే పోలీసులు విగ్రహ ఏర్పాటను అడ్డుకుంటున్నారన్నది నిర్వాహకుల మాట. పోలీసులు మాత్రం కొవిడ్ రూల్స్‌ను ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుదన్నది చిత్తూరు జిల్లాతోపాటు ఏపీ వ్యాప్తంగా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.