Tirupati Accident: భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి.. మరో 9 మందికి తీవ్రగాయాలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 18, 2021 | 11:12 AM

Lorry crashes into devotees: తిరుపతిలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి

Tirupati Accident: భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి.. మరో 9 మందికి తీవ్రగాయాలు..
Accident In Tirumala

Lorry crashes into devotees: తిరుపతిలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి  దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వడమాలపేట మండలం అంజేరమ్మ గుడి దగ్గర చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో భక్తులు తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నడుస్తుండగా.. లారీ ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా.. భక్తులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఘటన అనంతరం డ్రైవర్ లారీ వదిలేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

Nellore: కవలల హత్యకేసులో మిస్టరీ వీడింది.. హత్య చేసింది ఎవరంటే…?

Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu