Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి 5జీ సేవ‌లు

ఏపీలో ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో ట్రూ5జీ సేవ‌లు ప్రారంభమయ్యాయి.

Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి 5జీ సేవ‌లు
Jio 5g Services
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2023 | 9:33 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 5 జీ సేవలు ఇప్పటికే పలు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు నగరాల్లో ఇప్పటికే ఈ సేవలు అమల్లో ఉన్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో ట్రూ5జీ సేవ‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో నెట్‌వర్క్ కోసం జియో ఇప్ప‌టికే రూ. 26,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అదనంగా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. కాగా 1 జీబీఎఎస్‌+ వేగంతో అప‌రిమితి 5జీ డేటా వినియోగానికి యూజ‌ర్ల‌కు ‘జియో వెల్కం ఆఫ‌ర్‌’ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మందపల్లి మహేష్ కుమార్ తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5జీని విస్తరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ 5జీ ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ‘ అని మహేశ్‌ తెలిపారు.

జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ తెలిపారు. కాగా గతేడాది డిసెంబర్‌లో ఏపీలో మొదటిసారిగా రిలయన్స్‌ జియో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!