AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. రానున్న మూడు రోజుల పాటు కనిష్టానికి ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్ , యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో రానున్న మూడు రోజులకు పలు వాతావరణ సూచనలు చేసింది. 

AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. రానున్న మూడు రోజుల పాటు కనిష్టానికి ఉష్ణోగ్రతలు
Cold Waves In Ap
Follow us

|

Updated on: Jan 10, 2023 | 4:44 PM

మారుతున్న కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో ఒకటి వాతావరణంలో మార్పులు. వేసవి, వర్షాకాలం, శీతాకాలం అని లేదు.. ఇప్పుడు ఏ కాలంలోనైనా వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఎండలు మండించవచ్చు.. చలిగాలులు వణికించవచ్చు అనే విధంగా ఉంది నేటి కాలంలో వాతావరణం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వాతావరణ పరిస్థితుల గురించి అమరావతి వాతావరణ శాఖ కొన్ని సూచనలు  చేసింది. ఆంధ్రప్రదేశ్ , యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో ఏపీలో రానున్న మూడు రోజులకు పలు వాతావరణ సూచనలు చేసింది.   ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్- యానాం: ఈరోజు రేపు (జనవరి 11వ తేదీ) ఎల్లుండి( 12వ తేదీ) లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువగా రెండు లేదా మూడు డిగ్రీలు వరకు ఒకటి లేదా రెండు చోట్ల నమోదు కావచ్చునని పేర్కొంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు రేపు (జనవరి 11వ తేదీ) ఎల్లుండి( 12వ తేదీ) మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువగా రెండు లేదా మూడు డిగ్రీలు వరకు ఒకటి లేదా రెండు చోట్ల నమోదు కావచ్చును .

ఇవి కూడా చదవండి

రాయలసీమ : ఈరోజు రేపు (జనవరి 11వ తేదీ) ఎల్లుండి( 12వ తేదీ) రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతలకంటే తక్కువగా రెండు లేదా మూడు డిగ్రీలు వరకు ఒకటి లేదా రెండు చోట్ల నమోదు కావచ్చునని అమరావతి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..