Rajahmundry: జీతం పెంచమని ఆంధ్రా పేపర్‌ మిల్లు కార్మికుల ధర్నా.. సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక

జీతాలు పెంచుతారా? లేక గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోమంటారా? అంటూ అల్టిమేటం ఇచ్చారు ఆంధ్రా పేపర్‌ మిల్లు కార్మికులు. ఇంతకీ, వాళ్ల డిమాండ్స్‌ ఏంటి? కార్మికుల ఆవేదనకు కారణమేమిటో తెలుసా 

Rajahmundry: జీతం పెంచమని ఆంధ్రా పేపర్‌ మిల్లు కార్మికుల ధర్నా.. సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక
Rajahmundry Paper Mill
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2023 | 8:17 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రి ఆంధ్రా పేపర్‌ మిల్లు కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. మూడున్నరేళ్లుగా జీతాలు పెంచలేదంటూ పోరుబాట పట్టారు. గతంలో కూడా ఇచ్చిన హామీలను కూడా కంపెనీ యాజమాన్యం నెరవేర్చలేదని వాపోతున్నారు కార్మికులు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నామని, వెంటనే తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. పేపర్‌ మిల్లు కార్మికులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంఘీభావం ప్రకటించారు. కార్మికులతో కలిసి కంపెనీ ముందు బైఠాయించి ధర్నా చేశారు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ కంపెనీ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు.

తమ సమస్యలను పరిష్కరించకపోతే గోదావరిలోకి దూకి మూకమ్ముడి ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిస్తున్నారు కార్మికులు. గతంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరుతున్నారు. మూడున్నరేళ్లుగా జీతాలు పెంచకపోతే తామెలా బతకాలని అడుగుతున్నారు ఆంధ్రా పేపర్‌ మిల్లు కార్మికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..