Tirupati Heavy Rains: నిండా మునిగిన తిరుపతికి మరో గండం.. ఎనీటైమ్ రాయలచెరువు తెగిపోయే ఛాన్స్..
ఇప్పటికే నిండా మునిగిన తిరుపతికి మరో గండం. 15వ శతాబ్దం నాటి రాయలచెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెగిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Rayalacheruvu: తిరుపతి సమీపంలోని రాయలచెరువు కట్ట ఎనీటైమ్ తెగిపోయే అవకాశం కనిపిస్తోంది. 15వ శతాబ్దం నాటి చెరువు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. లీకేజీలు కూడా కనిపించాయి. ఓ చోట గండిని అధికార యంత్రాంగం పూడ్చివేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
చిత్తూరు జిల్లా ఇంకా ముంపులోనే మగ్గుతోంది. వందలాది గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో నానుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయ్. నదులు, వాగులు, వంకలు మహోగ్రరూపం దాల్చాయి.
జల విధ్వంసానికి టెంపుల్ సిటీస్ తిరుపతి, తిరుమల ఇప్పటికీ చిగురుటాగుల్లా వణికిపోతున్నాయి. ఎంఆర్‌పల్లి, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్, సరస్వతినగర్, గాయత్రినగర్, వాసవీనగర్ ప్రాంతాలు ముంపులోనే మగ్గుతున్నాయి. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీరు లేక జనం అల్లాడిపోతున్నారు.
తిరుమలలోనూ ఇదే పరిస్థితి. జల విధ్వంసానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్లు కొట్టుకుపోయాయి. ఘాట్ రోడ్స్, మెట్ల మార్గాల్లో పేరుకుపోయిన బురద, బండరాళ్లను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..
SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..
Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..