AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు.. ఆ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఖరారయింది. సీఎం జగన్ ఈనెల 11వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు.. ఆ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ..
Cm Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఖరారయింది. సీఎం జగన్ ఈనెల 11వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అదేరోజు సాయంత్రం తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలలో ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కోవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. గరుడవాహన సేవ జరిగే 11వ తేదీనే సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వేడుకలు మొదలయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ వాసుదేవ బ‌ట్టాచార్యులు కంక‌ణ‌భ‌ట్టర్‌గా వ్యవ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్తమ‌రుత్తులను (దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వజ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం.

విశ్వమంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తించ‌బ‌డుతున్నారని అర్చకులు చెప్పారు. కాగా, ధ్వజ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్యచంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్రదాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం (పొంగ‌లి) ప్రసాద వినియోగం పంచుతారు. ఈ ప్రసాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. ధ్వజ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్రతీక‌. పంచ‌భూతాలు, స‌ప్తమ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ఈరోజు ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కరోనా కారణంగా వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

Read Also.. Pawan Kalyan vs YCP: తాకట్టులో ఆంధ్రప్రదేశ్.. జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ విసుర్లు..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu