Watch: హమ్మయ్యా.. ఎట్టకేలకు చిరుత చిక్కిందయ్యా..! వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
వామ్మో.. అదిగో చిరుత పులి.. ఇప్పుడే కనిపించింది.. అటువైపు వెళ్లింది.. మళ్లీ వచ్చింది.. ఇలా ఓ చిరుత కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కొన్ని నెలలుగా ఎస్వీ వేదిక్ వర్సిటీల దగ్గర చిరుత సంచారంతో అటు విద్యార్థులు, ఇటు స్థానికులు గజగజ వణికిపోతున్నారు.. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీని భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.

వామ్మో.. అదిగో చిరుత పులి.. ఇప్పుడే కనిపించింది.. అటువైపు వెళ్లింది.. మళ్లీ వచ్చింది.. ఇలా ఓ చిరుత కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కొన్ని నెలలుగా ఎస్వీ వేదిక్ వర్సిటీల దగ్గర చిరుత సంచారంతో అటు విద్యార్థులు, ఇటు స్థానికులు గజగజ వణికిపోతున్నారు.. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీని భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. దీంతో అంతా ఎస్వీ అధికారులు, విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో కొన్ని నెలలుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. దాంతో.. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు నాలుగు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే.. చిరుతపులి ఓ బోనులో చిక్కింది. ఆడ చిరుతగా గుర్తించిన అటవీశాఖ అధికారులు.. కడప జిల్లా చిట్వేలు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
వీడియో చూడండి..
ఇక.. చిరుత పట్టుబడడంతో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. పట్టుబడిన చిరుతకు చెందిన మూడు పిల్లలు కూడా యూనివర్సిటీలో తిరుగుతున్నట్లు విద్యార్థులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బోన్లను అలాగే ఉంచి.. చిరుత పిల్లలను కూడా బంధించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..