AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తెల్లారేసరికి తహసీల్దార్ కార్యాలయానికి తాళం.. అవాక్కయిన ఎమ్మార్వో.. కట్ చేస్తే..

తిరుపతి జిల్లా నారాయణవనం తహసిల్దార్ కార్యాలయానికి తాళం పడింది. తహసిల్దార్ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా ఉన్న తలారి లోపల ఉండగానే తాళాలు పడ్డాయి. ఉదయం యధావిధిగా సిబ్బంది కార్యాలయానికి చేరుకోగా.. తాళం వేసిన కార్యాలయం దర్శనమిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియక సిబ్బంది తికమక పడగా అప్పటికే తలారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు..

Andhra: తెల్లారేసరికి తహసీల్దార్ కార్యాలయానికి తాళం.. అవాక్కయిన ఎమ్మార్వో.. కట్ చేస్తే..
Mro Office
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 30, 2025 | 10:13 AM

Share

తిరుపతి జిల్లా నారాయణవనం తహసిల్దార్ కార్యాలయానికి తాళం పడింది. తహసిల్దార్ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా ఉన్న తలారి లోపల ఉండగానే తాళాలు పడ్డాయి. ఉదయం యధావిధిగా సిబ్బంది కార్యాలయానికి చేరుకోగా.. తాళం వేసిన కార్యాలయం దర్శనమిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియక సిబ్బంది తికమక పడగా అప్పటికే తలారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయానికి తాళాలు వేశారు అంటూ.. సమాచారం ఇవ్వడంతో పోలీసులు అధికారులు తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం నారాయణవనం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది సమక్షంలో కార్యాలయ తాళం పగులగొట్టారు. అనంతరం కార్యాలయంలో సిబ్బంది యధావిధిగా విధుల్లో నిమగ్నం కాగా ఆరా తీసిన రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అసలు కార్యాలయానికి తాళం ఎందుకు వేశారు..? వేసింది ఎవరన్న దానిపై విచారణ జరిపారు. తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

కారణం అదేనా..?

అయితే, గ్రామంలో రవి అనే కాంట్రాక్టర్ ఇసుకను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నాడని.. రాత్రివేళల్లో కూడా ట్రాక్టర్ల రాకపోకలు సాగుతున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రవాణా చేస్తున్నాడాని చెప్పి ట్రాక్టర్ ను అధికారులకు అప్పగించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు నారాయణవరం మండల జడ్పిటిసి సుమన్ ఈ మేరకు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాడు. అయితే, కాంట్రాక్టర్ రవి తనకున్న పలుకుబడి ట్రాక్టర్ ను తీసుకెళ్లడంతో తాము అప్పగించిన ట్రాక్టర్ ను అధికారులు వదిలి పెట్టడంతో జడ్పిటిసి సుమన్ కి కోపం వచ్చింది.

ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడం స్థానికులు కొందరికి అగ్రహం తెప్పించింది. దీంతో ఏకంగా రెవెన్యూ అధికారుల కార్యాలయానికి తాళం వేయగా ఇది జడ్పీటీసీ సుమన్ పనేనన్న చర్చ నడుస్తోంది.

వీడియో చూడండి..

అయితే, జడ్పిటిసి సుమన్ ఒక వర్గానికి అండగా ఉండడం, మరో వర్గం ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ ఘటనకు కారణమన్న చర్చ నడుస్తుంది. అయితే పోలీసుల మాత్రం తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసిన ఘటనపై ఇలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరిని అదుపులోకి తీసుకొని పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరా అని ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..