Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థులు చికెన్ బిరియాని తిన్నారని క్రమశిక్షణ చర్యల పేరుతో ప్రిన్సిపాల్ విద్యార్థులను చితకబాదారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలూరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయం హాస్టల్లో విద్యార్థులు రెండుసార్లు బయట వ్యక్తుల ద్వారా బిరియాని ప్యాకెట్స్‌ని..

నవోదయ హాస్టల్‌లో బిర్యానీ పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలూరులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో ఇటీవల కొందరు విద్యార్థులు బయటి నుంచి బిర్యానీ తెప్పించుకుని తిన్నారు. 8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్ధులు రెండుసార్లు బయటనుంచి ఫుడ్ తెప్పించుకున్నారని తెలిసి ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ ఎందుకు తప్పారంటూ వాళ్లకి పనిష్మెంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా లైబ్రరీ స్టాఫ్‌కి చెప్పి తమను కొట్టించారని విద్యార్థులు అంటున్నారు. అటు.. బయటి ఫుడ్ హాస్టల్‌లోకి తేవడంపై పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చినవాళ్లను రప్పించారు ప్రిన్సిపల్.
పిల్లలు తప్పు చేస్తే ఇతరత్రా పనిష్మెంట్‌లు ఇవ్వాలి కానీ ఇలా కొట్టడం ఏంటని వారు నిలదీశారు. బయటి ఫుడ్‌తో తిని పిల్లలు అస్వస్థతకు గురైతే ఆ తప్పు తమపైకి వస్తుందంటూ నవోదయా యాజమాన్యం రిప్లై ఇచ్చింది. హాస్టల్‌లో మెనూ బాగా ఉంటే బయటి నుంచి బిర్యానీలు ఎందుకు తెప్పించుకుంటారంటూ పేరెంట్స్ ప్రశ్నించారు. ఏదైమైనా పిల్లలపై చెయ్యి చేసుకున్నందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరిట్ స్టూడెంట్, స్కూల్ టాప్ 5 ర్యాంకర్ మహేంద్ర కాళ్లపై వాతలు పడి కమిలిపోయేలా కొట్టిన స్కూల్ లైబ్రరీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

