Tirupati by-election: తిరుపతి ఉప ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ వివాదం.. ఓడిపోతామన్న భయంతోనే అంటూ…
Tirupati by-election: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తు వివాదం మరింత ముదురుతోంది.
Tirupati by-election: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తు వివాదం మరింత ముదురుతోంది. నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్‌కు ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించడంపై బీజేపీ కేంద్ర మంత్రులు, జనసేన నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలాఉంటే.. తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు రద్దైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై నవతరం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. జరుగుతున్న ప్రచారం, రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ కేంద్ర మంత్రులు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను మేనేజ్ చేయాలని చూశారని నవతరం పార్టీ అభ్యర్థి రమేష్ సంచలన ఆరోపణ చేశారు.
గాజు గ్లాస్ గుర్తు రద్దయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ‘గాజు గ్లాస్’ గుర్తుకే తిరుపతి ఎన్నికల్లో ఓటు వేస్తారనే నమ్మకం తనకు ఉందని రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలంటే.. పవన్ అభిమానులంతా ‘గాజు గ్లాసు’ గుర్తుకే ఓటు వేయాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.
Also read: