ఈ వాహనం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ మోడల్ వచ్చేసి బేస్ వేరియంట్. డీజిల్ ఇంజిన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే లగ్జరీ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లు. వీటి ధర వచ్చేసి వరుసగా రూ.68.90 లక్షలు, అలాగే రూ. 77.90 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. టాంజానైట్ మెటాలిక్, ఫైటోనివక్ బ్లూ మెటాలిక్, పేమోంట్ రెడ్ మెటాలిక్, బెర్నియా గ్రే యాంబర్ ఎఫెక్ట్ రంగుల్లో దీనిని సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 లోపు ఈ కారును బుక్ చేసుకుంటే 1.5 లక్షల ఖరీదు గల బీఎండబ్ల్యూ యాక్సెసిరీస్ లభిస్తాయి. ఇందులో బీఎండబ్ల్యూ డిస్ ప్లే కీ, హెడ్ ఫోన్లు, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.