Thief Snatches: మొబైల్ దొంగిలించాడు.. అబ్బే ఇది మన బ్రాండ్ కాదంటూ రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు.. మ్యాటర్ తెలిస్తే నవ్వు ఆపుకోలేరంతే..!
Thief Snatches: ఢిల్లీలో ఆసక్తికర దొంగతనం చోటు చేసుకుంది. దొంతనం ఆసక్తికరంగా ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా? అవునండీ బాబూ..
Thief Snatches: ఢిల్లీలో ఆసక్తికర దొంగతనం చోటు చేసుకుంది. దొంగతనం ఆసక్తికరంగా ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా? అవునండీ బాబూ.. మ్యాటర్ తెలిస్తే మీరే పడి పడి నవ్వుతారు. అసలేం జరిగిందంటే.. దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడాలో ఓ జర్నలిస్టు తన చేతితో ఫోన్ ఆపరేట్ చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలో నల్ల మాస్క్ ధరించిన వ్యక్తి హఠాత్తుగా వచ్చి.. ఆ ఫోన్‌ను దొంగిలించాడు. ఫోన్ చేతికి చిక్కగానే అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో ఆ జర్నలిస్టు సైతం దొంగ వెంట పరుగు తీశాడు. అయితే ఆ దొంగ కొద్ది దూరం వెళ్లాక.. తాను దొంగిలించిన ఫోన్‌ను చూసుకున్నాడు. అబ్బే.. ఇది మనకు కావాల్సిన బ్రాండ్ ఫోన్ ఇదికాదంటూ రియలైజ్ అయ్యాడు. వెంటనే వెనక్కి తిరిగి.. బాధిత వ్యక్తిని సమీపించాడు. ‘బ్రదర్.. ఇది నాకు కావాల్సిన బ్రాండ్ ఫోన్ కాదు. నాకు వేరే బ్రాండ్ ఫోన్ కావాలి.’ అంటూ ఆ ఫోన్‌ను రోడ్డుపై వదిలి తుర్రుమని జారిపోయాడు. దొంగ ఇచ్చిన ఝలక్‌కి బాధిత జర్నలిస్టు సైతం షాక్ అయ్యాడు. కాసేపటి తరువాత తేరుకుని ఫన్నీగా నవ్వుకున్నాడు. తాను ఎదుర్కొన్న ఫన్నీ ఇన్సిడెంట్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నాడు. ఇంతకీ ఆ దొంగకు ఏ బ్రాండ్ ఫోన్ కావాలో చెప్పలేదు కదా?.. ఆ ఫోన్ దొంగకు వన్‌ప్లస్ 9ప్రో బ్రాండ్ మొబైల్ కావాలట. ఆ ఫోన్ కోసమే అతను మొబైల్ చోరీకి పాల్పడినట్లు సదరు జర్నలిస్టు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Journalist Tweet:
Little numb as I write this. Sector 52 Noida Metro
A fellow with a black mask snatches my phone while I was messaging. I run. He turns back.. runs towards me.
“Bhai mujhe laga One Plus 9 pro model hai” Drops it on the floor and runs again. #WhatWasThis
— Debayan Roy (@DebayonRoy) April 5, 2021
Also read:
Ap corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కసారిగా పెరిగిన మరణాలు, దడ పుట్టిస్తున్న పాజిటివ్ కేసులు