Ap Corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కసారిగా పెరిగిన మరణాలు, దడ పుట్టిస్తున్న పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 31,892 కరోనా నిర్ధారణ..
Andhra Corona Total Cases: ఏపీలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 31,892 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,765 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. కోవిడ్ కారణంగా అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూర్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొత్తగా 1245 మంది కరోనా జయించినట్లు ప్రభుత్వం శుక్రవారం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 1,53,65,743 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16422 యాక్టివ్ కేసులున్నాయి.
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య: 918597
- రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య : 894896
- రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య: 7279
#COVIDUpdates: 09/04/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,15,702 పాజిటివ్ కేసు లకు గాను *8,92,001 మంది డిశ్చార్జ్ కాగా *7,279 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,422#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/NvTlRZswQz
— ArogyaAndhra (@ArogyaAndhra) April 9, 2021
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
దేశంలో కూడా ప్రమాదకరంగా కరోనా…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. కొత్తగా దేశంలో 1,31,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 802 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9.74 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా
14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం.. చివరకు