AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: యూపీలో దారుణం.. కరోనా వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Covid-19 Vaccine: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తుంటే..

Covid-19 Vaccine: యూపీలో దారుణం.. కరోనా వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Rabies Vaccine
Shiva Prajapati
|

Updated on: Apr 09, 2021 | 6:22 PM

Share

Covid-19 Vaccine: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం వ్యాక్షినేషన్‌ విషయంలో ఎనలేని అసలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి వ్యాక్సిన్ డోసులను క్షేత్రస్థాయి ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తుంటే.. వారికి మాత్రం ఆ వ్యాక్సిన్లపై కనీస అవగాహన లేకుండా పోతోంది. తాజాగా యూపీలోని షమ్లి జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా.. ముగ్గురు వ్యక్తులకు రేబిస్ వ్యాక్సిన్ వేశారు. ఇప్పుడిది యూపీలోనే కాక.. దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. యూపీలోని షమ్లి జిల్లాలో గల కంద్లా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో లబ్ధిదారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. ఇందులో భాగంగా.. గురువారం కూడా పలువురికి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా.. వారు రేబిస్ వ్యాక్సిన్‌ను బాధితులకు ఇచ్చారు. కంధ్లా ప్రాంతానికి చెందిన సరోజ్(70), అనార్కలి(72), సత్యవతి(60) మహిళలు.. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకునేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చారు. ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది.. ఆ మహిళలకు రేబిస్ వ్యాక్సి్న్ ఇచ్చారు. అయితే, తమకు ఇచ్చింది కోవిడ్ వ్యాక్సిన్ కాదని, రేబిస్ వ్యాక్సిన్ అని వారికి తెలియదు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు నేరుగా ఇంటికి వచ్చారు. తొలుత బాగానే ఉన్నప్పటికీ.. ఆ తరువాత వారిలో ఒక మహిళకు ఆరోగ్యం క్షీణించండం ప్రారంభించింది.

కుటంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఆరోగ్య కేంద్రంలో సదరు మహిళలకు రేబిస్ టీకా వేసినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబానికి తెలిపారు. వెంటనే.. వారు సీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు రియాక్ట్ అయిన అధికారులు.. సంబంధిత ఘటనపై విచారణకు ఆదేశించారు. తప్పు జరిగినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. బాధిత మహిళల తప్పు ఉన్నా వారిపైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. Also read:

Offbeat Indian Temples: మనదేశంలో రావణ, దుర్యోధనుడు, కంస, హిడంబిలకు ఆలయాలు .. పూజలు ఎక్కడో తెలుసా..!

King Mswati III Swaziland: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా