Trains Cancelled: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు అలర్ట్… నేటి నుంచి 34 రైళ్లు రద్దు.. ఎందుకంటే..
Trains Cancelled: ప్రయాణికులకు షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. కాజీపేట-బల్లార్‌షా సెక్షన్‌లో పనుల కారణంగా కొన్ని రోజుల పాటు 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు...
Trains Cancelled: ప్రయాణికులకు షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. కాజీపేట-బల్లార్‌షా సెక్షన్‌లో పనుల కారణంగా కొన్ని రోజుల పాటు 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జరుగుతున్న మరమ్మతు పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏయే రైళ్లు రద్దు అయ్యాయంటే…
► సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలు (రైలునెంబర్ 02757), సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (02758) రైలు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
► హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07011)రైలు, సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (07012)రైలు ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
► సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ( (07233) రైలు, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (07234) రైలు ఏప్రిల్ 10 నుంచి 24 వరకు రద్దు అయ్యాయి.
► సికింద్రాబాద్-దానాపూర్ (02787) రైలు, దానాపూర్-సికింద్రాబాద్ (02788) రైలు ఏప్రిల్ 23, 24 వరకు రద్దు అయ్యాయి.
► గోరఖ్‌పూర్-కొచ్చువేలి (02511) రైలు, కొచ్చువేలి-గోరఖ్‌పూర్ (02512) రైలు ఏప్రిల్ 11 నుంచి 21 వరకు రద్దు అయ్యాయి.
► బరౌనీ-ఎర్నాకుళం (02521) రైలు, ఎర్నాకుళం – బరౌనీ (02552) రైలు ఏప్రిల్ 12 నుంచి 23వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
► హజ్రత్ నిజాముద్దీన్ -యశ్వంత్‌పూర్ (06250) రైలు ఏప్రిల్ 10,11,12,13,15,17,18,19, 20, 22 తేదీలలో రద్దు అయ్యింది.
► యశ్వంత్‌పూర్-కోర్బా (02251) రైలు ఏప్రిల్ 9,16, 23 తేదీల్లో, కోర్బా-యశ్వంత్‌పూర్ (02252) రైలు ఏప్రిల్ 11,18, 25వ తేదీల్లో రద్దు అయ్యాయి.
► యశ్వంత్‌పూర్-లక్నో (02683)రైలు, లక్నో-యశ్వంత్‌పూర్ (02684)రైలు ఏప్రిల్ 15, 22 తేదీల్లో రద్దు అయ్యాయి.
► గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ (05023) రైలు, యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (05024) రైలు ఏప్రిల్ 15, 22 తేదీల్లో రద్దు అయ్యాయి.
► కొయంబత్తూరు -హజ్రత్ నిజాముద్దీన్ (06077)రైలు, హజ్రత్ నిజాముద్దీన్-కొయంబత్తూరు (06078) రైలు ఏప్రిల్ 14,21 తేదీల్లో రద్దు అయ్యాయి.
► సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (02285) రైలు, హజ్రత్ నిజాముద్దీన్ – సికింద్రాబాద్ (02286) రైలు ఏప్రిల్ 23న రద్దు అయ్యాయి.
► చెన్నై-హజ్రత్ నిజాముద్దీన్ (06151) రైలు, హజ్రత్ నిజాముద్దీన్ – చెన్నై సెంట్రల్ (06152)రైలు ఏప్రిల్ 19న రద్దు అయ్యాయి.
► సికింద్రాబాద్ -దర్భంగా (07007) రైలు, దర్భంగా – సికింద్రాబాద్ (07008) రైలు ఏప్రిల్ 23న రద్దు అయ్యాయి.
► తిరునల్వేలి-శ్రీమాతా వైష్ణోదేవీ కాట్రా (06787) రైలు ఏప్రిల్ 12, 19 తేదీల్లో, శ్రీమాతా వైష్ణోదేవీ కాట్రా -తిరునల్వేలి (06788) రైలు ఏప్రిల్ 15,22 తేదీల్లో రద్దు అయ్యాయి.
► తిరువనంతపురం సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ ( (06167) రైలు ఏప్రిల్ 13, 20వ తేదీల్లో, నిజాముద్దీన్ – తిరువనంతపురం సెంట్రల్ (06168) రైలు ఏప్రిల్ 16, 23 తేదీల్లో రద్దు అయ్యాయి.
► కోర్బా-కొచ్చువేలి (02647) రైలు ఏప్రిల్ 14,17,21,24 తేదీల్లో, కొచ్చువేలి -కోర్బా (02648) రైలు ఏప్రిల్ 12,15,19,22 తేదీల్లో రద్దు అయ్యాయి.
ఇవీ చదవండి: Indian Railways: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్…రైల్వే సేవలు రద్దు చేస్తారా? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
Bike Discounts: బంపర్ ఆఫర్.. బైక్ కొంటే రూ.50 వేల వరకు తగ్గింపు.. ఏప్రిల్ 30 వరకు గడువు
Electric Bike: ఈ బైక్ 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్
SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..