Treasure Trove: గుప్త నిధులు దొరికితే.. ఆ నిధి ఎవరికి చెందుతుంది… ఎలా పంచుతారంటే..!

Treasure Trove: ఒకొక్కసారి తవ్వకాలలో గత వైభవ చిహ్నాలకు తాలూకా బంగారం, వెండి, వజ్రాలు, రాగి పాత్రలు లభ్యమవుతుంటాయి. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తిలో నిన్న లంకెబిందెలు బయటపడ్డాయి..

Treasure Trove: గుప్త నిధులు దొరికితే.. ఆ నిధి ఎవరికి చెందుతుంది... ఎలా పంచుతారంటే..!
Treasure Trove
Follow us

|

Updated on: Apr 09, 2021 | 5:33 PM

Treasure Trove: ఒకొక్కసారి తవ్వకాలలో గత వైభవ చిహ్నాలకు తాలూకా బంగారం, వెండి, వజ్రాలు, రాగి పాత్రలు లభ్యమవుతుంటాయి. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తిలో నిన్న లంకెబిందెలు బయటపడ్డాయి. ఇందులో 18 తులాల 7 గ్రాముల బంగారం, కిలో 720 గ్రాముల వెండి, 7 గ్రాముల పగడాలు, కిలోకుపైగా రాగిపాత్ర, ఇతర బంగారు ఆభరణాలున్నాయి. ఇలా బయటపడిన గుప్త నిధులు ఎవరికి చెందుతాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చేనీయాంశమైంది. అయితే ఆ భూమిలో దొరికిన నిధి తమ పూర్వీకులది నిరూపిస్తే కొంత యజమానులకు దక్కుతుందనే వాదనుంది. అసలు ఇలా గుప్త నిధులు దొరికితే.. చట్టం ఏం చెబుతోంది. నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..! భూమిలోపల దొరికిన ఎలాంటి నిధి ఏదైనా ప్రభుత్వానిదే .. ఎవరికీ హక్కులుండవు.. వారసత్వ సంపద కింద ప్రభుతానికే చెందుతున్న నిధి. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి.. జాతి వారసత్వ సంపద అయితే ప్రభుత్వానికే చెందే వీలుంటుంది. అటువంటి సొమ్ముపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు.. ఆ నిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

1878లో ఇండియన్‌ ట్రెజర్‌ ట్రోవ్‌ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ని స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ యాక్ట్ లో ఏదైనా ఒక ప్రాంతంలో, లేదంటే భూమిలో నిధి నిక్షేపాలు దొరికిన వైనం పై క్లారిటీ ఇచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేస్తుంది ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ). భూమిలో లభ్యమైన గుప్తనిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందినవి రాయి నుంచి.. రతనాల దాకా ఏమి దొరికినా.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా వాటిని స్వాధీనం చేసుకుంటుంది. ఎక్కడైనా నిధి దొరికిందని సమాచారం తెలియగానే తొలిగా అడుగు పెట్టేది స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్‌కు అధికారులు స్వాధీనం చేస్తారు. అప్పుడు ఆ నిధి వారసత్వ సంపదా? లేక పూర్వీకులు దాచి ఉంచినదా? అన్నది కలెక్టర్ నిర్ధారిస్తారు. ఆ సంపద పూర్వీకులదైతే.. దాని వారసులెవరన్నదానిపై విచారణ చేసి సంపదను వాటాలుగా విభజించి కలెక్టర్ ఆ సంపదను పంచుతారు.

లభించిన గుప్త నిధిలో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు.. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే ప్రత్యేక నిబంధన కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా ఇస్తారు. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పకపోతే సదరు వ్యక్తులు శిక్షార్హులు. నిధి ఇవ్వకుండా తీసుకోవాలని చూస్తే సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా రెండు విధించిన సందర్భాలున్నాయి. పెంబర్తిలో దొరికింది జాతీయ సంపద కనుక ప్రభుత్వానికి ఆ నిధి చెందుతుంది.

Also Read: మనదేశంలో రావణ, దుర్యోధనుడు, కంస, హిడంబిలకు ఆలయాలు .. పూజలు ఎక్కడో తెలుసా..!

తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా.. అయితే ఆంధ్రా కాశ్మీరం ఉందిగా..!