Texas Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు.. వరుస కాల్పులతో ఆందోళన

Texas Shooting: అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతోంది. ఇప్పటికే వరుస కాల్పులతో దద్దరిల్లుతున్న అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పలు చోటు చేసుకున్నాయి. టెక్సాస్‌ రాష్ట్రం బ్రియాన్‌లో...

Texas Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు.. వరుస కాల్పులతో ఆందోళన
Texas Shooting
Follow us
Subhash Goud

|

Updated on: Apr 09, 2021 | 8:14 PM

Texas Shooting: అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతోంది. ఇప్పటికే వరుస కాల్పులతో దద్దరిల్లుతున్న అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పలు చోటు చేసుకున్నాయి. టెక్సాస్‌ రాష్ట్రం బ్రియాన్‌లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తుపాకుల హింసను ‘అంటువ్యాధి’ అని ఈ సంక్షభాన్ని పరిష్కరించే ప్రణాళికను ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని బ్రియాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దుండగులు కాల్పులు ఎందుకు జరిపాడనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

గురువారం మధ్యాహ్నం 2.30 గంటల (అమెరికా కాలమాన ప్రకారం) కాల్పులు చోటు చేసుకోగా, సమాచారం అందుకున్నట్లు పోలీసు చీఫ్‌ ఎరిక్‌ బస్కే వెల్లడించారు. కెంట్‌ మూరే కేబినెట్స్‌లో ఈ ఘటన జరిగిందని, నిందితుడు ఈ సంస్థలోనే పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అగ్రరాజ్యంలో తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు చేపట్టారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ (ఏటీఎఫ్‌) డైరెక్టర్‌గా డేవిడ్‌ చిప్‌మాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాల్పుల్లో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని, గ్రీమ్స్‌ కౌంటీలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై టెక్సాస్‌ గవర్నర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్‌ రేంజర్స్‌తో కలిసి పని చేస్తున్నామని, స్థానిక చట్ట అమలుకు పూర్తి సహాయం చేస్తామని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి: Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

Indian Techie: అమెరికాలో విషాదం.. భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారి

Thief Snatches: మొబైల్ దొంగిలించాడు.. అబ్బే ఇది మన బ్రాండ్ కాదంటూ రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు.. మ్యాటర్ తెలిస్తే నవ్వు ఆపుకోలేరంతే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!