AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

World Health Organization analysis: భారత దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకున్నా... పాజిటివ్‌ బారిన పడుతుండటంతో ఈ వైరస్‌ గురించి అంతుచిక్కడం లేదు...

Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO
World Health Organization
Subhash Goud
|

Updated on: Apr 09, 2021 | 7:41 PM

Share

World Health Organization analysis: భారత దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకున్నా… పాజిటివ్‌ బారిన పడుతుండటంతో ఈ వైరస్‌ గురించి అంతుచిక్కడం లేదు. వైరస్‌లో మార్పుల (మ్యుటేషన్ల) కారణంగా దాని వ్యాప్తి గతంలో కంటే మరింత తీవ్ర స్థాయిలో పెరిగింది. భారత్‌లో గత ఏడాది మొదటి వేవ్‌లో కేసులు తారస్థాయికి చేరడానికి ఏడు నెలల సమయం పడితే.. సెకండ్‌ వేవ్‌ కేవలం రెండు నెలల్లోనే కేసులు ఆ స్థాయికి చేరుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో కరోనా వ్యాప్తి భారీగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌ 21వ తేదీ నాటికి వేగంగా పెరిగింది. ఆ వారంలో 6.46 లక్షల కేసులు నమోదయ్యాయి. 8,166 మంది మృతి చెందారు. కరోనా మొదటి వేవ్‌ తారాస్థాయికి చేరడానికి ఏడు నెలల సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఆ స్థాయి తీవ్రత దాదాపు రెండు నెలల్లోనే కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

సెకండ్‌ వేవ్‌లో గత వారంలో భారత్‌లో 5.13 లక్షల కేసులు నమోదు కాగా, అదే వారంలో 3,071 మరణాలు సంభవించాయి. మొదటి వేవ్‌ తీవ్రత సమయంలో ఎలాంటి భయానక పరిస్థితి ఉందో ఇప్పుడు అలాంటి తీవ్రతే ఉంది. ఇక తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌ మూడో వారంలో 16,201 కేసులు, 78 మరణాలు నమోదు అయ్యాయి. సెకండ్‌వేవ్‌లో చూస్తే గత వారంలో తెలంగాణలో 7,873 కేసులు రాగా, 33 మంది మృతి చెందారు. మన రాష్ట్రలో మొదటి వేవ్‌లోని తీవ్రతలో 50 శాతం సెకండ్‌ వేవ్‌లో నెల రోజుల్లోనే కనిపిస్తుండం గమనార్హం.

మన దేశంలో మొదటివేవ్‌లో ఒక కరోనా రోగి తనకు సన్నిహితంగా మెలిగిన వారిలో 17శాతం మందికి వైరస్‌ వ్యాపించేస్తే.. ఇప్పుడు 24 శాతం మందికి అంటిస్తున్నారు. అంటే ప్రైమరీ కాంటాక్టుల్లో వ్యాధి సోకుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇలా ఒకరి నుంచి ఒకరికి అదే స్థాయిలో విస్తరణ పెరుగుతూ వస్తోంది.న అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి పాజిటివ్‌ వస్తే, అతనితో సమీపంగా మెలిగిన 25 మంది 720 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌ మూలంగా ఇప్పుడు కుప్పలుతెప్పలుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఆ మధ్య పాఠశాలలు, ఇప్పుడు షాపింగ్ మాల్స్‌, శుభకార్యాలు, విందులు, వినోదాల్లో పాల్గొన్న వారి ద్వారా కేసులు పెరుగుతున్నాయి.

అలాగే నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలో ఇటీవల ఒక వివాహ వేడుకకు హాజరైన 370 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే అందులో ఏకంగా 86 మందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగించింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం.. మన దేశంలో సెకండ్‌ వేవ్‌ లో కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గుర్తిస్తున్న కేసుల్లో ఔట్‌బ్రేక్స్‌లో కనుగొన్నవే ఎక్కువగా ఉన్నాయి. లక్షణాలు కనపడగానే గుర్తించకుండా సీరియస్‌ అయ్యాక అనేక మంది ఆస్పత్రులకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి: Ap Corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కసారిగా పెరిగిన మరణాలు, దడ పుట్టిస్తున్న పాజిటివ్ కేసులు

Corona Vaccine: ప్రపంచంలో సంపన్నదేశాల్లో మాత్రమే వేగంగా వ్యాక్సినేషన్.. చాలా పేద దేశాల్లో వ్యాక్సిన్ అలికిడే లేదు!

Madhya Pradesh: నాకు కాదు కరోనా.. లోపలున్నవాడికి.. అంబులెన్స్ ఆపి చెరకురసం కోసం వచ్చిన ఆరోగ్య కార్యకర్త!