AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్‌ .. మందు బాబులకు అదిరిపోయే ఆఫర్‌

Covid-19 Vaccine: దేశంలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్‌...

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్‌ .. మందు బాబులకు అదిరిపోయే ఆఫర్‌
Covid 19 Vaccine
Subhash Goud
|

Updated on: Apr 09, 2021 | 8:46 PM

Share

Covid-19 Vaccine: దేశంలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్‌ వేయడం వేగవంతం చేసింది. ఇక వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రభుత్వం కోరుతుండగా, ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని ఇతర సంస్థలు సైతం కోరుతున్నాయి. అందుకు పలు రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అంతేకాదు.. వ్యాక్సిన్‌ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇందులో భాగంగా హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌ తాజాగా మందుబాబులకు అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కరోనా టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్‌ పట్టుకెళ్లండి అని ప్రకటించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కార్డు చూపించినట్లయితే బీర్‌ అందజేస్తామని స్పష్టం చేసింది. ఇంకేముంది రెస్టారెండు వద్ద భారీగా క్యూ పెరిగింది. ఏప్రిల్‌ 5వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఈవారం వరకు కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో గుర్గావ్‌ గోల్డ్‌ రోడ్‌లోని ఇండియన్‌ గ్రిల్‌ రూమ్‌ రెస్టారెంట్‌కు మధ్య ప్రియుల తాకిడి భారీగా పెరిగింది.

గుజరాత్‌ రాజ్‌కోట్‌ జిల్లాకు చెందిన స్వర్ణకారుల వర్గానికి చెందిన వారు ఇటీవల కరోనా టీకా వేయించుకున్న మహిళలకు ముక్కు పుడకలు, పురుషులకు చేతి కడియాలు పంపిణీ చేశారు. అలాగే అదే జిల్లాకు చెందిన జాన్‌ విజన్‌ సంస్థ టీకా వేయించుకున్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందజేస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా… మందుబాబులు టీకా వేసుకునేలా ప్రోత్సహించేందుకు వారికి మద్యాన్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించడం చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. అయితే టీకా వేసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మద్యం తాగవద్దని నిపుణులు సూచిస్తుండగా, ఇక్కడ మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీర్‌ అందజేయడం మందుబాబుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఇవీ చదవండి: Health Minister Harsh Vardhan : కరోనా వ్యాక్సిన్ కొరత ఉందంటూ చెలరేగుతోన్న ఊహాగానాలపై కేంద్రమంత్రి మాట.!

Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'