Covid-19: కరోనా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైద్యులు, వైద్య సిబ్బందికి శుభవార్త

Covid-19: కరోనా మహమ్మారితో పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న విదేశీ వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్‌ సిబ్బందికి బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త..

Covid-19: కరోనా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైద్యులు, వైద్య సిబ్బందికి శుభవార్త
Indian Doctors
Follow us

|

Updated on: Apr 09, 2021 | 9:38 PM

Covid-19: కరోనా మహమ్మారితో పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న విదేశీ వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్‌ సిబ్బందికి బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏడాది పాటు వీసా గడువును ఉచితంగా పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 1తో వీసా గడువు ముగిసే వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్‌ సిబ్బందితో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుందని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల సుమారు 14వేల మంది లబ్ది పొందనున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా యూకే హోమ్‌ సెక్రటరీ ప్రతీ పటేల్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌ చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్న హెల్త్‌, కేర్‌ వర్కర్ల అంకితభావం, నైపుణ్యం నిజంగా అసాధారణమైనదని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడడమే కాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో సైతం వారు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి సేవలు వెలకట్టలేనివని, అయినా ఉచితంగా వీసాల గడువును పొడగిస్తూ.. ఈ హీరోల సహకారం ఎంత విలువైందో బ్రిటన్ తెలుపుతోంది’ అని పేర్కొన్నారు. కరోనా అంటే ప్రతి ఒక్కరు వణికిపోయే పరిస్థితి ఉందని, అలాంటి సమయంలో వారి ధైర్యం చెప్పలేనిదని అన్నారు.

కాగా, గత సంవత్సరం నవంబర్‌లో కూడా బ్రిటన్‌ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌ సర్కార్‌ తీసుకున్న తాజాగా నిర్ణయం వల్ల అక్కడ పని చేస్తున్న భారతీయ వైద్యులు, నర్సులకు లబ్ది చేకూరనుంది.

కాగా, కరోనా మహమ్మారి బ్రిటన్‌లో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ కూడా అక్కడే మొదలైంది. ఒక వైపు కరోనా కేసులు.. మరో వైపు స్ట్రెయిన్‌ కేసుల వల్ల తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. మరో వైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో పెద్ద తలనొప్పిగా మారింది. కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నా.. ఆ మహమ్మారి కట్టడి అదుపులోకి రావడం లేదు.

ఇవీ చదవండి: Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

Texas Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు.. వరుస కాల్పులతో ఆందోళన