అమెరికాలో సంచలనం రేపుతున్న భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. ఇది హత్యేనా..? దర్యాప్తు ముమ్మరం
అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ దంపతులు అనుమానస్పద స్థతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన బాలాజీ భరత్ రుద్రావర్ (32), భార్య ఆర్తి బాలాజీ...
అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ దంపతులు అనుమానస్పద స్థతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన బాలాజీ భరత్ రుద్రావర్ (32), భార్య ఆర్తి బాలాజీ (30) న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్లన్‌లో వారి నివాసంలో బుధవారం విగతజీవులుగా కనిపించారు. ఆ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. ఈ చిన్నారి ఏడుస్తూ బాల్కానీలోకి రావడంతో ఏడుస్తూ కనిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వారి మృతిపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. వారి శరీరాలపై ఉన్న కత్తిపోట్లను పరిశీలిస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో విచారణ వేగవంతం చేస్తున్నారు.
కాగా, మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన బాలాజీ దంపతులు 2015 ఆగస్టులో అమెరికా వలస వెళ్లారు. బాలాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆర్తి ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. ఇక బాలాజీ, ఆర్తి మృతితో వారి స్వస్థంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి మృతదేహాలు స్వదేశానికి రావడానికి 8 రోజుల నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారి న్యూజెర్సీలోని వారి స్నేహితుల వద్ద ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా బెర్గెన్ కౌంటీ ప్రాసిక్యూటర్ మార్క్ ముసెల్లా మాట్లాడుతూ.. నార్త్ ఆర్లింగ్టన్ పోలీసులు, బెర్గెన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం మేజర్ క్రైమ్ యూనిట్ సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో నార్త్ ఆర్లింగ్టన్ పోలీసులకు బాలాజీ పొరుగింటి వారి నుంచి 911కు ఫోన్ వచ్చిందని, దాంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినట్లు ముసెల్లా పేర్కొన్నారు.
ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, దంపతులు చనిపోయి ఉన్నారని చెప్పారు. వారిద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉండటంతో పలు అనుమానాలు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై బెర్గెన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం మేజర్ క్రైమ్స్ యూనిట్ చీఫ్ రాబర్ట్ అంజిలోట్టి, నార్త్ ఆర్లింగ్టన్ పోలీసు విభాగం చీఫ్ స్కాట్ హెడెన్‌బర్గ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ముసెల్లా వెల్లడించారు.
భార్య ఏడు నెలల గర్బిణీ
కాగా, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులతో తాము మాట్లాడామని, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని అంబాజోగాయ్‌కి చెందిన బాలాజీ భరత్ రుద్రవర్ ఐటీ నిపుణుడు. 2015లో తన భార్య ఆర్తి బాలాజీతో కలిసి అమెరికా వచ్చారు. ఆర్తి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ. వారికి ఉన్న నాలుగేళ్ల చిన్నారి అనాథగా మారిపోయింది. ప్రస్తుతం చిన్నారి మృతుల స్నేహితుల సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.
Encounter: జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు ఉగ్రవాదుల హతం..
Crime News: ఓయో రూమ్ బుక్ చేయాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కైయ్యాడు.. లక్షలు పోగొట్టుకున్నాడు…
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ టిప్పర్.. 18 మందికి గాయాలు