Encounter: జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు ఉగ్రవాదుల హతం..
Encounters in Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో
Encounters in Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వతుల్ హింద్ చీఫ్ ఇంతియాజ్ అహ్మద్ షాతో సహా ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలు వెల్లడించాయి. గురువారం రాత్రి షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. నలుగురు సైనికులు గాయపడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
దీంతోపాటు శుక్రవారం ఉదయం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతం నౌబాగ్ వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆ రెండు జిల్లాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
ఉగ్రవాదులకు లొంగిపోయేందుకు అవకాశమిచ్చామని వారే భద్రతా బలగాలపై ముందుగా కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. కాగా.. జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీనిలో భాగంగా అనుమానిత ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Also Read: