AP Crime News: కారమే.. కానీ కారం కాదు.. ఇదో కల్తీ యవ్వారం.. కోటీ నలభై లక్షల రూపాయల విలువైన కారం సీజ్

ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏది దొరికితే అది.. ఎక్కడ వీలైతే అక్కడ నకిలీ, కల్తీలతో ప్రత్యేక్షమవుతున్నాయి. చివరకు మనుషులు...

AP Crime News: కారమే.. కానీ కారం కాదు.. ఇదో కల్తీ యవ్వారం.. కోటీ నలభై లక్షల రూపాయల విలువైన కారం సీజ్
Fake Chiili Powder
Follow us

|

Updated on: Apr 09, 2021 | 9:41 PM

ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏది దొరికితే అది.. ఎక్కడ వీలైతే అక్కడ నకిలీ, కల్తీలతో ప్రత్యేక్షమవుతున్నాయి. చివరకు మనుషులు తినే ఫుడ్‌ కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. మొన్నటికి మొన్న ఏపీలో పలు చోట్ల నకిలీ నెయ్యి భారీగా పట్టుబడింది. ఇంకా ఆ దాడులు కొనసాగుతుండగానే.. తాజాగా భారీగా కల్తీ కారం పట్టుబడడం కలకలం రేపుతోంది. నిత్యం వంటల్లో వాడే కారం కూడా కల్తీ అవుతోంది. ఇటీవల ఏపీలో ఆహారం కల్తీ కేసులు వరుసగా వెలుగులోకి వస్తుండడంతో… ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రత్యేక బృందాలు దాడులు చేస్తూ.. భారీగా కల్తీని బయటకు లాగుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పలు కారం మిల్లులపై ఫుడ్‌ సేఫ్టీ, పౌర సరఫరాల, తూనీకలు, కొలతల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. దాడుల్లో మిర్చియార్డుకు సమీపంలో ఉన్న ఓ కారం మిల్లును సీజ్ చేశారు.

సదరు మిల్లులో మిర్చి తొడిమలు, తాలు కాయలతో కారంపొడి తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా… లేబలింగ్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్యాకింగ్ కూడా చేస్తున్నట్టు గుర్తించామని ఫుడ్ ఇన్ స్పెక్టర్ గౌస్‌ వెల్లడించారు. మంచి మిర్చితో తాలు కాయలను కొంతమేర కలిపి కారం తయారు చేయొచ్చు… కానీ, వ్యాపారులు పూర్తి తాలు కాయలతో కారం చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. తాలు కాయలు మార్కెట్‌కు రాకుండా చూడాల్సిన బాధ్యత యార్డు అధికారులదేనని.. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ దాడుల్లో మొత్తం కోటీ నలభై లక్షల రూపాయల విలువైన కారాన్ని సీజ్ చేయడంతో పాటు… సంబంధిత మిల్లులను కూడా సీజ్‌ చేశామని చెప్పారు. కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే చాలా సార్లు హెచ్చరించినా… వ్యాపారుల్లో మార్పు రావడంలేదని అధికారులు అంటున్నారు. కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తీప్పవని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ మరోసారి వ్యాపారులను హెచ్చరించారు.

Also  Read: తెలంగాణలో షర్మిళ నయా పార్టీ.. ఆ పార్టీలో గుబులు.. నేతల రియాక్షన్ ఇదే

పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెఎస్ షర్మిల.. కట్టు, బొట్టులో విభిన్నత.. రీజన్ ఇదే !