కొద్దిరోజుల్లో పెళ్లి.. కానీ యువతి దారుణ హత్య..! కాబోయే వరుడి పనేనా..? కారణాలు ఇలా ఉన్నాయి..

Bihar Girl Murder : ఆ యువతికి పెళ్లి నిశ్చయమైంది.. కొద్ది రోజుల్లోనే వివాహం.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన ఆమె తలలేని మొండెంతో దర్శనమిచ్చింది. అమాయకురాలైన

  • uppula Raju
  • Publish Date - 5:28 am, Sat, 10 April 21
కొద్దిరోజుల్లో పెళ్లి.. కానీ యువతి దారుణ హత్య..! కాబోయే వరుడి పనేనా..? కారణాలు ఇలా ఉన్నాయి..
murder

Bihar Girl Murder : ఆ యువతికి పెళ్లి నిశ్చయమైంది.. కొద్ది రోజుల్లోనే వివాహం.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన ఆమె తలలేని మొండెంతో దర్శనమిచ్చింది. అమాయకురాలైన యువతిని అత్యంత దారుణంగా కాళ్లు, రెక్కలు కట్టేసి తల నరికేసారు. పెళ్లిపీటలెక్కాల్సిన యువతి శ్మశానానికి పయనమైంది. తలలేని కూతరు శవాన్ని చూసి ఆమె తల్లిదండ్రుల గుండెలు రోదిస్తున్నాయి. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో చావు బాజాలు మోగుతున్నాయి. బిహార్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామానికి చెందిన యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. వరుడి కుటుంబ సభ్యులకు సుమారు 4 లక్షల విలువైన లాంఛనాలను కూడా ముట్టజెప్పారు. మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే యువతిని ఎవరో హత్యచేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. అయితే యువతి మరణానికి వరుడి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆజాద్‌ గతంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారం నెరిపాడని వారి కుటుంబ సభ్యులే ఈ యువతిని కిడ్నాప్‌ చేసి చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యువతి కాళ్లు, చేతులు కట్టేసి ఆమె తల నరికి కిరాతకంగా చంపేశారు. వరుడి లవ్ ఎఫైర్ కారణంగానే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కుటుంబ సభ్యులకు హామినిచ్చారు.

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..

నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..