YS Sharmila new party: పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెఎస్ షర్మిల.. కట్టు, బొట్టులో విభిన్నత.. రీజన్ ఇదే !

వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు..

YS Sharmila new party: పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెఎస్ షర్మిల.. కట్టు, బొట్టులో విభిన్నత.. రీజన్ ఇదే !
Sharmila New
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2021 | 9:14 PM

వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో షర్మిలకు రాజకీయాలు కొత్త కాదు. కానీ తానే సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేస్తుండటంతో తనకంటూ ఓ ప్రత్యేకత కావాలని కోరుకుంటున్నారు. దాని కోసం ప్రతి విషయంలోనూ స్పెషల్ ఉండాలని భావిస్తున్నారు.

తాజాగా ఖమ్మంలో జరిగే సంకల్పసభలో కూడా తాను ప్రత్యేకంగా ఉండాలని ముందు నుంచే ప్లాన్‌ చేసుకున్నారు షర్మిల. అందులో భాగమే ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం. కట్టు, బొట్టులో కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్న షర్మిల, దానికి సంకల్పసభనే వేదికగా చేసుకుంటున్నారు. తాను పూర్థిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలో జరుగుతున్న మొదటి సమావేశంలోనే తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే పోచంపల్లి చీరలో దర్శనమిచ్చారు షర్మిల.

చేనేత వస్త్రాల్లో పోచంపల్లి చీరలకు ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలో ప్రాచూర్యం పొందిన పోచంపల్లి చీరను ధరించడం వల్ల ఇక్కడి ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటు తాను కూడా బహిరంగసభలో ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే పోచంపల్లి చీరను ఎంచుకున్నారు షర్మిల. మహిళలు చీరలో హుందాగా కనిపిస్తారు. అందుకే ఖమ్మం సభ కోసం పోచంపల్లి చీరను ఎంపిక చేసుకున్నారు షర్మిల.

నిమ్మపండు రంగులో నీలం అంచు చీర కట్టుకుని ప్రత్యేకంగా నిలిచారు షర్మిల. మోచేతుల వరకు జాకెట్‌ ధరించి హుందాగా కనిపించారు. పూర్థి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందు చీరలో అరుదుగా కనిపించారు షర్మిల. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళుతుండటంతో ప్రత్యేకంగా ఉండాలని పోచంపల్లి చీరను ఎంచుకున్నారు. చేనేత వస్త్రాల్లో పోచంపల్లి చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ఈ చీరలకు మంచి పేరుంది. ఇప్పుడు షర్మిల ధరించడం వల్ల కూడా వాటి ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉంది.

రాజకీయాలను శాసించిన, శాసిస్తున్న చాలా మంది గొప్ప నేతలు కూడా తమ ఆహార్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి నచ్చిన విధంగా దుస్తులను డిజైన్‌ చేయించుకుని మరీ ఉపయోగించేవారు. షర్మిల తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డ్రెస్ స్టయిల్‌ కూడా స్పెషల్‌గా ఉండేది. మోచేతుల వరకు మడిచిన తెలుపు రంగు ఖద్దరు చొక్కా.. అంచుతో కూడిన తెల్లపంచెతో తెలుగుదనానికి నిలువెత్తు సంతకంలా కనిపించేవారు వైఎస్‌ఆర్‌. తెల్లపంచెతో ఆయన నడిచొస్తుంటే ఓ నిండైన విగ్రహం కళ్ల ముందు కదలాడేది. వైఎస్‌ఆర్‌ ను చూసి చాలా మంది అదే ఆహార్యాన్ని అనుసరించిన వారూ ఉన్నారు. రాజసం ఉట్టిపడేలా నడుస్తూ వచ్చే రాజశేఖరరెడ్డిని అభిమానులు రాజన్న అని పిలుచుకునేవారు.

కాగా ప్రస్తుత ఏపీ సీఎం జగన్, షర్మిల అన్న వైఎస్ జగన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చాక కొన్నాళ్లు చెక్స్ షర్ట్స్‌లో కనిపించిన సీఎం జగన్.. ఆ తర్వాతి కాలంలో తెల్లరంగు ఖద్దరు అంగి, గోధుమ రంగు ఫ్యాంట్‌కు పరిమితమైపోయారు.  ఏ కార్యక్రమంలో చూసినా ముఖ్యమంత్రి జగన్ ఇవే దుస్తుల్లో కనిపిస్తారు.

ఇప్పటి వరకు తమ ఆహార్యంతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తండ్రి, అన్న మాదిరిగానే తాను కూడా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు వైఎస్‌ షర్మిల. అందుకే మొదటి నుంచే కట్టు బొట్టులో స్పెషల్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ఓ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Also Read: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం.. చివరకు

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?