YS Sharmila new party: తెలంగాణలో షర్మిళ నయా పార్టీ.. ఆ పార్టీలో గుబులు.. నేతల రియాక్షన్ ఇదే

తెలంగాణలో షర్మిళ పార్టీ...స్ట్రాటజీ ఎలా ఉన్నా...కాంగ్రెస్‌ పార్టీని మాత్రం కలవరపెడుతోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు కొందరు ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.

YS Sharmila new party: తెలంగాణలో షర్మిళ నయా పార్టీ.. ఆ పార్టీలో గుబులు.. నేతల రియాక్షన్ ఇదే
Ys Sharmila
Follow us

|

Updated on: Apr 09, 2021 | 8:05 PM

తెలంగాణలో షర్మిళ పార్టీ…స్ట్రాటజీ ఎలా ఉన్నా…కాంగ్రెస్‌ పార్టీని మాత్రం కలవరపెడుతోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు కొందరు ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. అంతేకాదు కొంత ఆంధ్రా ఓటు బ్యాంక్‌ కూడా ఆ పార్టీకి ఉంది. దీంతో కొత్తగా షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆమెకు ఇక్కడేం పని…ఏదైనా ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని గట్టిగానే చెబుతున్నారు.

ఖమ్మంలో జరిగిన షర్మిల సంకల్పసభపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు మండిపడ్డారు. కరోనాతో జనం పరేషాన్‌ అవుతుంటే…షర్మిళకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేం ఎక్కడికైనా వెళ్తేనేమో ఆంక్షలు విధిస్తారు…మరీ షర్మిళ 600 కార్లతో రహదారిపై రోడ్‌షోతో వెళ్తుంటే..డీజీపీ మహేందర్‌రెడ్డి ఎలా అనుమతి ఇచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇదంతా ఆంధ్రా ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు ఆడిస్తున్న డ్రామా అని వి.హన్మంతరావు ఆరోపించారు. ఆంధ్రాలో జగన్‌, తెలంగాణలో షర్మిళ ముఖ్యమంత్రులు కావాలని విజయమ్మ కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. అలా అయితే తాము గాజులు తొడుక్కోని కూర్చోలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న అమ్మా కూతుళ్ల బహిరంగసభ విజయవంతం కావాలని సీపీఐ నారాయణ ఆకాంక్షించారు. కానీ…ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరన్నట్లు.. విజయమ్మ కుటుంబ సభ్యులే…వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొత్తానికి షర్మిళ పార్టీతో తెలంగాణలో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం…? ఆంధ్రా ఓట్లు చీలిపోతాయనే టెన్షన్‌ ఉన్నది ఎవరికో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం.. చివరకు