తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో సోమవారంనాడు అగ్ని ప్రమాదం సంభవించింది. భయంతో భక్తులు ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
తిరుమల, 13 జనవరి 2025: తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో భక్తులు భయాందోళనకు గురైయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.