బెబ్బులి సంచారంతో బెంబేలెత్తిన స్థానికులు.. వన్యప్రాణులకు తప్పని నీటికష్టాలు..
ఏడాది క్రితం రెండు పులులు పల్నాడు జిల్లాలోని నలమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపాయి. 2023 వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే దుర్గి మండల గజాపురం పరిసర ప్రాంతాల్లో రెండు పులులు సంచరించాయి. సంచరించడమే కాకుండా ఒక ఆవుపై దాడి చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు.

ఏడాది క్రితం రెండు పులులు పల్నాడు జిల్లాలోని నలమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపాయి. 2023 వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే దుర్గి మండల గజాపురం పరిసర ప్రాంతాల్లో రెండు పులులు సంచరించాయి. సంచరించడమే కాకుండా ఒక ఆవుపై దాడి చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. 2023లో సకాలంలో వర్షాలు లేకపోవడంతో నలమల అటవీ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో పులులు నీటి అవాసాలను వెతుక్కొంటూ కొండ దిగువకు వచ్చిందని అంచానా వేశారు. మరోవైపు నలమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య కూడా పెరిగిందని వాటి అవాసానికి సమస్యలు ఎదురవడంతోనే చిట్టడవి నుండి బయటకు వచ్చాయని అనుకున్నారు. ఆ తర్వాత పులులు జాడ లేకపోవడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయినట్లు భావించారు.
ఈ ఏడాది వేసవి ముగిసే సమయంలో మరోసారి పులుల సంచారం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పల్నాడు జిల్లా దావుపల్లి అటవీ ప్రాంతంలోని బొటుకులపాయ బేస్ క్యాంప్ వద్ద అటవీ శాఖాధికారులు సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపధ్యంలో అధికారులు సాసర్ పిట్ లద్వారా త్రాగునీటి మడుగులు ఏర్పాటు చేస్తారు. ఈ నీటి కోసం అటవీ జంతువులు వస్తుంటాయి. ఈ తావుల వద్ద ట్రాప్ కెమెరాలను అమరుస్తారు. ఏ సమయంలోనైనా అటవీ జంతువులు అక్కడకు వస్తే వాటి కదలికలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. అదే విధంగా నలమల నుండి సాసర్ పిట్ల వద్దకు పులులు వచ్చి సిసి కెమెరాల్లో రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఉంటుందని ఎవరూ భయపడాల్సిన పని లేదంటున్నారు. మొత్తం మరోసారి పల్నాడు జిల్లాలో పులి కదలికలు కనిపించడంతో అటు అటవీ శాఖాధికారులు ఇటు స్థానికులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..