Andhra Pradesh: నెల్లూరులో విషాదం.. దూసుకొచ్చిన మృత్యువు.. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

నెల్లూరు పట్టణంలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో ఉన్న రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

Andhra Pradesh: నెల్లూరులో విషాదం.. దూసుకొచ్చిన మృత్యువు.. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం
Train
Follow us
Basha Shek

|

Updated on: Jan 22, 2023 | 6:11 AM

నెల్లూరు పట్టణంలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో ఉన్న రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు వారిని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.