Konaseema: పురోహితుడు అరుదైన రికార్డు.. 5 లక్షల గింజలపై జాతీయ జెండా చిత్రీకరణ
వృత్తి రీత్యా పురోహితుడు.. అయినప్పటికీ మంచి కళాకారుడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేటకు చెందిన పురోహితుడు
వృత్తి వేరు.. ప్రవ్రుత్తి వేరు.. తమ జీవనోపాధి కోసం వృత్తిని చేపడితే.. తమలోని అభిరుచిని నెరవేర్చుకోవడం కోసం కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో తమలో దాగున్న కళతో విభిన్నంగా ప్రయత్నించి పదువురితో ప్రశంసలను అందుకుంటారు. అలా ఓ కళాకారుడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల గింజలపై జాతీయ జెండా రంగులు వేసి ఔరా అనిపిస్తున్నాడు. వృత్తి రీత్యా పురోహితుడు.. అయినప్పటికీ మంచి కళాకారుడు.
పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి. గతంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా రిపబ్లిక్ డే పురస్కరించుకుని మరో రికార్డ్ నెలకొల్పాడు. సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు రామచంద్ర. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు రామచంద్ర తెలిపాడు. బైట్ః పెద్దింటి రామచంద్ర శ్రీహరి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..