AP Assembly: అప్పుడు జగన్‌, ఇప్పుడు చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) అంటేనే అధికార పక్షాన్ని, ప్రతి పక్షాలు ఇరుకన పెట్టడం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు..

AP Assembly: అప్పుడు జగన్‌, ఇప్పుడు చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
Jagan And Chandrababu Ap Po
Follow us
TV9 Telugu

| Edited By: Narender Vaitla

Updated on: Mar 07, 2022 | 1:00 PM

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) అంటేనే అధికార పక్షాన్ని, ప్రతి పక్షాలు ఇరుకన పెట్టడం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నలు సంధించడం. కానీ ఏపీ రాజకీయాల్లో ఈ సంస్కృతి క్రమేణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ దాదాపు రెండున్నరేళ్లు అసెంబ్లీకి హాజరుకాలేదు.. తాజాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు సభకు హాజరుకాలేదు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరై కాసేపటికే వాకౌట్‌ చేస్తూ బయటకు వెళ్లిపోయారు.

అప్పట్లో స్పీకర్ కోడెల వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ సహా అందరూ సభ నుంచి వెళ్లిపోయారు..మళ్లీ హాజరు కాలేదు.. ప్రజాసమస్యలపై తాము మాట్లాడుతుంటే పదేపదే కట్ చేస్తుండడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసెంబ్లీలోనే ప్రశ్నించారు.. అంతేగాక సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరు కాకుండా జనాల్లోకి వెళ్లారు జగన్.. రాష్టవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.. తాజాగా అసెంబ్లీలో తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారంటూ సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు చంద్రబాబు..వస్తే మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెడతానన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో తన సభ నుంచి వెళ్లిపోయిన ఆయన ఈ సమావేశాలకు హాజరుకాలేదు. అసలు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాకూడదని మొదట నిర్ణయించారు..కానీ ఎందుకో ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఎమ్మెల్యేల వరకూ సభకు హాజరయ్యారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోవడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో తప్పు బట్టింది.. ప్రజాసమస్యలపై ప్రస్తావించడానికి అసెంబ్లీకి హాజరుకానీ ఎమ్మెల్యేలు అదే ప్రజధనంతో జీతాలు ఎలా తీసుకుంటారంటూ అనేకసార్లు మంత్రులు విమర్శించేవారు.. అదే మాట వైసీపీ నుంచి తాము ఎదుర్కోవాల్సి ఉంటుందనుకున్నారో ఏమో గానీ టీడీపీ ఎమ్మెల్యేలయితే సభకు హాజరయ్యారు

ప్రజాస్వామ్యంలో ఇది మంచిదేనా.?

ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి..ప్రజాస్వామ్యంలో అధికారపార్టీని నిలదీసే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది.. అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించవచ్చు.. ఏదైనా బిల్లు పెడితే ఓటింగ్ లో పాల్గొనవచ్చు.. అధికారపార్టీ తప్పులను ఎత్తి చూపాలి..కాని ఇప్పుడు అలా జరగకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశమే.

అసెంబ్లీలో టీడీపీ అనూహ్య నిర్ణయం..

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలింది. సభ ప్రారంభమై గవర్నర్‌ ప్రసంగం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు ప్రతిపక్ష సభ్యులు. వారి నినాదాలు, ఆందోళనతో దాదాపు 20 నిమిషాలు గవర్నర్‌ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. వారి నినాదాల మధ్యే ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు గవర్నర్‌. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి మార్షల్స్‌ వచ్చే సమయానికి టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశారు.

అశోక్ వేములపల్లి, టీవీ9, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్.

Also Read: AP Assembly Session 2022 Live: ముగిసిన గవర్నర్‌ ప్రసంగం.. కీలక అంశాలు ఇవే..

వాహనదారులకు సూచన.. బండ్లను అలా చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే

Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!