వాహనదారులకు సూచన.. బండ్లను అలా చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే

వాహనదారులకు సూచన.. బండ్లను అలా చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే
Vehicles

తుక్కుగా మార్చాలనుకున్న వాహనాల వివరాలను సంబంధితశాఖ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని కేంద్ర రహదారి, రవాణాశాఖ(Central Roads and Transport department ) స్పష్టం చేసింది. ఈ మేరకు..

Ganesh Mudavath

|

Mar 07, 2022 | 10:14 AM

తుక్కుగా మార్చాలనుకున్న వాహనాల వివరాలను సంబంధితశాఖ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని కేంద్ర రహదారి, రవాణాశాఖ(Central Roads and Transport department ) స్పష్టం చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ ఫంక్షన్స్‌ ఆఫ్‌ వెహికిల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ పేరితో ఓ ముసాయిదా విడుదల చేసింది. ఈ ముసాయిదాపై సలహాలు, సూచనలను 30 రోజుల్లోపు తెలపాలని సూచించింది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను కూడా తుక్కు కోసం అప్పగించవచ్చని వెల్లడించింది. ఇలా అప్పగించిన వాహనం చోరీకి గురైందా, లేదంటే దాంతో ఇతర నేరాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలను వాహన్‌ పోర్టల్‌ ద్వారా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌(Crime Records) బ్యూరోలో తనిఖీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. వాహనం తాకట్టులో, బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదని, ఈ నిబంధనలు అన్నీ అయిపోయాకే వాహనాలను తుక్కుకు(Scrapped Vehicles) స్వీకరిస్తారమని ముసాయిదా ప్రకటనలో వివరించింది. వాహన యజమాని పాన్‌ నెంబర్‌, వాహనాన్ని తుక్కుకు అప్పగిస్తున్నట్లుగా స్టాంప్‌ పేపర్‌పై రాసిన అధీకృత లేఖ కాపీలనూ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఒరిజినల్‌ ఆర్‌సీ, యజమాని ఫొటో గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఓ ఫొటో ఇవ్వాలి.

ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ జారీ అయ్యాకే వాహనం తుక్కు కోసం యజమాని అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. తుక్కుకు వాహనాన్ని ఇచ్చిన యజమాని కొత్త వాహనం కొనుగోలు సమయంలో ప్రోత్సాహకాలు, రాయితీలు పొందాలంటే పాత వాహనాన్ని తుక్కుకు సమర్పించినట్లు నిరూపించే సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. దీంతో కేంద్రం విధించిన నిబంధనల మేరకు పాత వాహనాన్ని తుక్కుగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Also Read

Prabhas: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?

వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో

WhatsApp: ఇక నుంచి అన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ లోనే.. ఎందుకో తెలుసా..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu