ఆ ఊరంతా కవలలే..

ఆ బావిలో నీళ్లు తాగినవారికి కవల పిల్లలు పుడుతున్నారు. గత ఇరవై ఐదేళ్ల కాలంలో దాదాపు ఆ గ్రామంలో అంతా కవల సంతానమే జన్మించారు. కవలలకు ప్రసిద్ధి చెందిన ఆ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి దగ్గర్లో ఉన్న దొడ్డిగుంట గ్రామం. గత పాతికేళ్లుగా ఈ ఊరిలో ఉన్న బావి కవలల జన్మించడానికి కారణంగా మారిపోయింది. ఈ నీటిని తాగడం వల్ల తమకు ట్విన్స్ పుట్టారని ఆ ఊరి ప్రజలతో పాటు అక్కడ ఉద్యోగం కోసం వచ్చిన […]

ఆ ఊరంతా కవలలే..
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 8:42 PM

ఆ బావిలో నీళ్లు తాగినవారికి కవల పిల్లలు పుడుతున్నారు. గత ఇరవై ఐదేళ్ల కాలంలో దాదాపు ఆ గ్రామంలో అంతా కవల సంతానమే జన్మించారు. కవలలకు ప్రసిద్ధి చెందిన ఆ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి దగ్గర్లో ఉన్న దొడ్డిగుంట గ్రామం.

గత పాతికేళ్లుగా ఈ ఊరిలో ఉన్న బావి కవలల జన్మించడానికి కారణంగా మారిపోయింది. ఈ నీటిని తాగడం వల్ల తమకు ట్విన్స్ పుట్టారని ఆ ఊరి ప్రజలతో పాటు అక్కడ ఉద్యోగం కోసం వచ్చిన వారు సైతం చెబుతుడంటం విశేషం. ఇంతగా ఆకర్షిస్తున్న దొడ్డిగుంట బావి గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిన విషయమే. అయితే ఇదే విషయం జిల్లాలు దాటిపోవడంతో ఏకంగా కార్లలో వచ్చి బావి నీటిని డబ్బాల్లో నింపుకుని వెళ్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది.

ఇక ఇదే విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ .. తమ గ్రామంలో దాదాపు ఇరవై ఐదు కుటుంబాల్లో కవలలు జన్మించారని చెబుతున్నారు. ఇంతకీ ఈ బావి నీటిలో ఉన్న విశిష్టత ఏమిటన్న విషయం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. దొడ్డిగుంట బావి నీటిలో ఉన్న గొప్పతనం ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.