Fact Check: పింఛన్ రావడం లేదని వృద్ధురాలు రోదిస్తున్న వీడియో వైరల్.. ప్రభుత్వ వివరణ ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నెలా ఫస్ట్ తారీఖున వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి.. పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. అంతే కాకుండా పింఛన్ సొమ్మును విడతల వారీగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నెలా ఫస్ట్ తారీఖున వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి.. పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. అంతే కాకుండా పింఛన్ సొమ్మును విడతల వారీగా పెంచుతూ.. రూ.2,750 చేసింది. అనర్హులకు కాకుండా అర్హత కలగిన వారికి మాత్రమే పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. తనకు అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ కట్ చేశారంటూ ఓ వృద్ధురాలు రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఇన్సిడెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పాతదని తేల్చింది. దురుద్దేశంతో కొందకు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడింది. ప్రభుత్వం ప్రతిష్ఠతను దిగజార్చేందుకు ఇలాంటి ప్రయత్నాలకు తెర లేపుతున్నారని పైర్ అయ్యింది. అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
#FactCheck Old viral video of pensioner, from last year (who got her documents regularized by SERP as per the required procedures and received pension in August 2022), is being peddled again.
Please verify such videos before sharing on social media. https://t.co/vDR7dw2dl9 pic.twitter.com/XhXS1FhC7H
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 5, 2023
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ 2023 జనవరి 1 నుంచి రూ.2750 అయింది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 2 లక్షల 31 వేల మందికి పెన్షన్ మంజూరు చేసింది. జనవరి 1 నుంచి వారం రోజులపాటు పెన్షన్ వారోత్సవాలు జరగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలుండేది. ఈ పించన్‌ను ప్రభుత్వం తొలుత 2,250 చేసింది. ఆ తరువాత ఏడాదికి రూ.250 పెంచుతూ.. ఇప్పుడు రూ.2,750 వరకు చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..