మందుబాబులూ బీ అలర్ట్.. పేకాటరాయుళ్లూ పారాహుషార్.. డ్రోన్స్‌ ఆన్‌ డ్యూటీ..!

నిర్మానుష్య ప్రదేశంలో ఏం చేసినా ఎవరూ చూడరనుకుంటే మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే మిమ్మల్ని నిఘానేత్రం వెంటాడుతుంది. డ్రోన్స్‌ ఆన్‌ డ్యూటీలో ఉన్నాయి. మీ ప్రతీ కదలికను రికార్డ్‌ చేసి కటకటాల పాలు చేస్తోంది. బహిరంగంగా మద్యం సేవిస్తూ, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. డ్రోన్ టెక్నాలజీని వినియోగించి పోకిరీగాళ్ల పనిపడుతున్నారు పోలీసులు. పందెం రాయుళ్ళతోపాటు గంజాయిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

మందుబాబులూ బీ అలర్ట్.. పేకాటరాయుళ్లూ పారాహుషార్.. డ్రోన్స్‌ ఆన్‌ డ్యూటీ..!
Ap Police Drone
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 31, 2024 | 7:36 AM

న్యూ ఇయర్ వేడుకలను సముద్రతీరంలో ఎంజాయ్‌ చేద్దాం.. సరుకు తీసుకెళ్లి సందడి చేద్దాం అనుకుంటే కొత్త సంవత్సరాన్ని జైలులో జరుపుకోవాల్సిందేనంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో ఇటీవల ఆకతాయిల ఆడగాలు పెరిగిపోయాయి. సముద్రతీరం వెంట చాలా దూరం వెళ్లి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. బహిరంగంగా మద్యపానం సేవిస్తూ, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. డ్రోన్ టెక్నాలజీని వినియోగించి పోకిరీగాళ్ల పనిపడుతున్నారు పోలీసులు.

తాము వెళ్లలేని చోటుకు డ్రోన్లను పంపిస్తున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ల ద్వారా పేకాటరాయుళ్ల ఆటకట్టించారు పోలీసులు. కోడిపందాల బరులను గుర్తించి పందెం రాయుళ్లను జైలుకు పంపారు. డ్రోన్ నిఘాతో గంజాయి బ్యాచ్‌ మత్తు దించారు. ఈవ్‌టీజర్ల భరతం పట్టారు. గతంలో న్యూఇయర్ వేళ కోనసీమ జిల్లాలోని సముద్రతీరప్రాంతంలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని.. చట్ట విరుద్ధకార్యకలాపాలకు పాల్పడ్డారు. దీంతో ఈసారి తీర ప్రాంతం వెంట డ్రోన్లతో నిఘా పెట్టారు పోలీసులు. ఉప్పలగుప్తం మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసులు.

సముద్ర తీర ప్రాంతం మాత్రమే కాదు ఇతర సమస్యాత్మక ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉన్నచోట కూడా డ్రోన్‌లతో నిఘాపెట్టారు పోలీసులు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో భద్రతకు డ్రోన్లనే వినియోగిస్తున్నారు. స్థానికులైనా, టూరిస్టులైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డ్రోన్ల నుంచి తప్పించుకోలేరంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!