Tenali: వాయమ్మో.! నెలకోసారి చిట్టీలు కడుతున్నారా.? ఈ బంగారం వ్యాపారి ఏం చేశాడో తెల్సా
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 కోట్ల రూపాయల సేకరించి ఉడాయించాడు ఓ మాయగాడు. చిట్టీలు, బంగారు ఆభరణాల తాకట్టు పేరుతో మహిళలను నమ్మించి కుచ్చుటోపి పెట్టేశాడు. ఆ వివరాలు ఏంటో..? ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూసేద్దాం.

ప్రజల ఆశలను, అమాయకత్వాలను సొమ్ము చేసుకునే వాళ్లు ఎప్పటికప్పుడు వాళ్లను మోసగిస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా తెనాలి పట్టణంలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. కొల్లూరు ఉదయ వెంకటేశ్వరావు, మురళి చిట్టీల పేరుతో అనేక మందిని నిండా ముంచేశారు. ఖాతాదారుల నుంచి రూ. 8 కోట్లకు పైగా వసూలు చేసి ఉడాయించారు. సేవింగ్స్, పెట్టుబడులు, బంగారం ఆభరణాలు తాకట్టు, ఆభరణాలు తయారీ, చిట్టీల పేరుతో బాధితులకు కుచ్చు టోపీ పెట్టి కుటుంబంతో సహా పారిపోయారు. విషయం తెలుసుకున్న బాధితులు నాజరుపేటలోని నిర్వాహకుని ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటి దగ్గర ఎవరూ లేరని తెలుసుకున్న బాధితులు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి గంగానమ్మపేటలో గత 23 ఏళ్లుగా బంగారం దుకాణాలను నడుపుతూ ఖాతాదారులను ఆకర్షించిన వెంకటేశ్వరరావు తాను స్థాపించిన సొసైటీలో ఖాతాలు తెరవమని ఒత్తిడి తీసుకొచ్చేవారని బాధిత మహిళలు తెలిపారు. తెనాలి, చావలి ప్రాంతాల్లో శాఖలు తెరచి ఖాతాదారులను ఆకర్షించిన వెంకటేశ్వరరావు ఇలాంటి మోసానికి పాల్పడతాడని బాధితులు ఊహించలేకపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం పట్టించుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
