Andhra: యువతులు స్నానం చేస్తుండగా.. ఎక్కడనుంచో ఫ్లాష్ లైట్ వెలుగు.. ఏంటని చూడగా
చదువు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరం వచ్చి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్ధినిలకు సీక్రెట్ కెమెరాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏపీలో మరో లేడీస్ హాస్టల్‌లో దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

ఏపీలో లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరులోని బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్‌లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ పలువురు విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి అసభ్యకరంగా మెసేజ్ చేయడం.. ఫోన్‌లు మాట్లాడటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ హాస్టల్ విద్యార్థినిలు పోలీసులకు తెలిపారు. స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఖాళీ చేయమన్నందుకే తమపై ఫిర్యాదు చేశారని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు.
గతంలోనూ ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. గతేడాది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపిసింది. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బయటపడింది. దాంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఇలా తరచుగా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో.. ఆడపిల్లలను హాస్టల్స్‌కు పంపిచాలంటనే తల్లిదండ్రలు భయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
