TDP: ‘రా.. కదలిరా’ అంటున్న టీడీపీ.. భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసిన చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. వచ్చే ఎన్నికల కోసం ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దీనికోసం భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్రణాళికలు సిద్దం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. వచ్చే ఎన్నికల కోసం ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దీనికోసం భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్రణాళికలు సిద్దం చేసింది. జనవరి 5 నుంచి 29 వరకూ మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈనెల 18 మినహా మిగిలిన అన్ని రోజుల్లో సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి రోజూ రెండు సభలు జరగనున్నాయి. అయితే ఈ సభలకు రా.. కదలిరా అనే పేరు పెట్టారు టీడీపీ నాయకులు. ఇదే పేరుతోనే అన్ని సభలు నిర్వహిస్తామంటున్నారు. ప్రతి సభలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఈ బహిరంగ సభలకు కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
చంద్రబాబు జిల్లాల వారి షెడ్యూల్ ఇదే
- జనవరి 5 – కనిగిరి (ఒంగోలు పార్లమెంట్)
- జనవరి 6 – తిరువూరు (విజయవాడ పార్లమెంట్), ఆచంట (నరసాపురం పార్లమెంట్)
- జవవరి 9 – వెంకటగిరి (తిరుపతి పార్లమెంట్), ఆళ్లగడ్డ (నంద్యాల పార్లమెంట్)
- జనవరి 10 – బొబ్బిలి (విజయనగరం పార్లమెంట్), తుని (కాకినాడ పార్లమెంట్)
- జనవరి 18 – గుడివాడ (మచిలీపట్నం పార్లమెంట్)
- జనవరి 19 – గంగాధర నెల్లూరు (చిత్తూరు పార్లమెంట్), కమలాపురం (కడప పార్లమెంట్)
- జనవరి 20 – అరకు (అరకు పార్లమెంట్), మండపేట (అమలాపురం పార్లమెంట్)
- జనవరి 24 – పీలేరు (రాజంపేట పార్లమెంట్ ), ఉరవకొండ (అనంతపురం పార్లమెంట్)
- జనవరి 25 – కోవూరు (నెల్లూరు పార్లమెంట్), పత్తికొండ(కర్నూలు పార్లమెంట్)
- జనవరి 27 – గోపాలపురం (రాజమండ్రి పార్లమెంట్), పొన్నూరు(గుంటూరు పార్లమెంట్)
- జనవరి 28 – మాడుగుల (అనకాపల్లి పార్లమెంట్), టెక్కలి (శ్రీకాకుళం పార్లమెంట్)
- జనవరి 29 – ఉంగుటూరు (ఏలూరు పార్లమెంట్), చీరాల(బాపట్ల పార్లమెంట్)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.