Dadi Veerabhadra Rao: ఏపీ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్.. వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. జగన్ నేతృత్వంలోని అధికార పార్టీ వైసీపీ స్పీడును పెంచింది.. కూడికలు, తీసివేతలతో పలు నియోజకవర్గాల్లో మార్పులు.. చేర్పులు చేస్తోంది. ఈ తరుణంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. కీలక నేత దాడి రాజీనామా చేశారు. విశాఖపట్నం నగరానికి చెందిన ఉత్తరాంధ్ర కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురవడంతో.. పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. జగన్ నేతృత్వంలోని అధికార పార్టీ వైసీపీ స్పీడును పెంచింది.. కూడికలు, తీసివేతలతో పలు నియోజకవర్గాల్లో మార్పులు.. చేర్పులు చేస్తోంది. ఈ తరుణంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. కీలక నేత దాడి రాజీనామా చేశారు. విశాఖపట్నం నగరానికి చెందిన ఉత్తరాంధ్ర కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురవడంతో.. పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. తనకు టికెట్ రానందుకే దాడి విరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడివీరభద్రరావు అనకాపల్లి టికెట్‌ను ఆశించారు. అయితే టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని వీరభద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డికి పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు మాజీమంత్రి దాడి ఏకవాక్యంతో రాజీనామా లేఖను ముగించారు.
కాగా.. దాడివీరభద్రరావు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల వేళ అందరూ సీట్లు, టెకెట్లు ఆశించడం సహజమన్నారు. అందరినీ సంతృప్తిపరచడం ఏ పార్టీకి కూడా సాధ్యం కాదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. సర్దుబాట్లు అనంతరం ప్రాధాన్యత ఉంటుందని చెప్పామన్నారు. మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని వీరభద్రరావుకు చెప్పామని.. అయినా వినలేదంటూ పేర్కొన్నారు. దాడి రాజీనామాతో పార్టీకి నష్టం లేదంటూ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
వీడియో చూడండి..
4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..
దాడి వీరభద్రరావు.. ఎన్టీఆర్ పిలుపుతో 1985లో మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేసి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1994, 1999లలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు గెలిచి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2012 దాకా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందడంతో దాడి కుటుంబం రాజీనామా చేసి బయటకు వచ్చింది.. మళ్లీ 2019 ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..