AP News: వార్నీ.! ఇదేం లెక్కో.. మండలమేమో ఏపీలో.. పిన్ కోడ్ మాత్రం తెలంగాణలో..
జిల్లాలు మారిన రాష్ట్రాలు మారినా.. ఇప్పటికీ తెలంగాణ పిన్ కోడే కొనసాగుతుంది ఆ మండలానికి. ఇంతకీ అదెక్కడ ఉందనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఏపీలోనే.. అది కూడా ఏలూరు జిల్లాలో ఉంది. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం..

జిల్లాలు మారిన రాష్ట్రాలు మారినా.. ఇప్పటికీ తెలంగాణ పిన్ కోడే కొనసాగుతుంది ఆ మండలానికి. ఇంతకీ అదెక్కడ ఉందనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఏపీలోనే.. అది కూడా ఏలూరు జిల్లాలో ఉంది. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం..
వివరాల్లోకెళ్తే.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట విభజన అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ మండలానికి అదే పిన్‌కోడ్ కొనసాగుతుండటంతో ప్రజలలో అయోమయం నెలకొంది. ప్రస్తుతం ఆ మండలానికి కొత్త పిన్‌కోడ్ ‘534444’ వచ్చినా.. ఆ పిన్‌కోడ్ పూర్తిస్థాయి అమల్లోకి రాకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. గతంలో ‘507114’ పిన్‌కోడ్ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు మండలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది. అయినప్పటికీ మొన్నటిదాకా పిన్‌కోడ్ మాత్రం మారలేదు. ఇటీవల కొత్త పిన్‌కోడ్ వచ్చినా.. ఎలాంటి ఉపయోగం లేదు.
‘534444’ పిన్‌కోడ్‌ను మూడేళ్ల క్రితం కేటాయించారు. కానీ ఆ పిన్‌కోడ్‌ను ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొత్త పిన్‌కోడ్ కొట్టినా.. మండలం పేరు ఎక్కడా చూపించడం లేదు. ఇక చివరికి దిక్కుతోచని స్థితిలో పాత పిన్‌కోడ్ ‘507114’పైనే ఉత్తరాలు, పలు కీలక సేవలు కొనసాగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీ షోలలో ఏదైనా వస్తువు ఆర్డర్ పెడదామన్నా.. పిన్‌కోడ్ గందరగోళం నెలకొనడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనీ ఆర్డర్‌లు, ఇతరత్రా లావాదేవీలు పంపాలంటే.. చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. ‘50714’ పిన్‌కోడ్ రాసి.. వయా బూర్గంపాడు అని చిరునామాతో అడ్రస్ పొందుపరిస్తేనే వచ్చే పరిస్థితి నెలకొంది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. బూర్గంపాడు మండలం తెలంగాణలో ఉంది.
