Vizag: వాకింగ్ చేస్తుండగా సడన్‌గా పక్కకొచ్చి ఆగిన ఆటో.. భయంతో ఏంటా అని చూడగా..
విశాఖలోని గాజువాక ప్రాంతం.. వృద్ధురాలు ఒంటరిగా వెళ్తోంది. ఆమెపై ఓ ఆటో డ్రైవర్ కంటపడింది. వాడితో మరో ఇద్దరు జత కలిశారు. అనుమానం వచ్చి కాస్త అడుగులు తొందరగా వేసింది ఆ వృద్ధురాలు. ఆటోలో వెంబడించారు. కట్ చేస్తే..

విశాఖలోని గాజువాక ప్రాంతం.. వృద్ధురాలు ఒంటరిగా వెళ్తోంది. ఆమెపై ఓ ఆటో డ్రైవర్ కంటపడింది. వాడితో మరో ఇద్దరు జత కలిశారు. అనుమానం వచ్చి కాస్త అడుగులు తొందరగా వేసింది ఆ వృద్ధురాలు. ఆటోలో వెంబడించారు. కట్ చేస్తే.. ఆమె మెడలోని బంగారు ఆభరణం లాక్కెళ్లిపోయారు. చివరకు సీసీటీవీ ఫూటేజ్‌లో.. దొంగలే కాదు రిసీవర్‌ని కూడా పట్టుకున్నారు పోలీసులు.
గాజువాక క్రైం సీఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీహరిపురానికి చెందిన 84 ఏళ్ల షియా ప్రసాద్ సింగ్ గత నెల 24న గొందేశిపాలెంలో వాకింగ్ చేస్తుండగా పక్కనే ఆటో ఆగింది. చూసి భయంతో ముందుకెళ్లేసరికి వెంబడించి.. ఆమె మెడలోని తులం బంగారు చైన్, నగదు లాక్కుని వెళ్లిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి భయపడిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన గాజువాక క్రైం పోలీసులు.. సీసీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించారు. నెంబర్ ప్లేటు సరిగా లేనప్పటికి.. చాకచక్యంగా దొంగల ఆచూకీని కనిపెట్టగలిగారు. చేపల ఆనంద్, చిరుపాటి రాజు, కంబాల శ్రీను అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి బంగారం, నగదుతో పాటు మద్యం సీసాలు, ఇనుపరాడ్డు, ఆటోనూ స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసినందుకు ఎల్లాజీ అనే రిసీవర్‌ను కూడా అరెస్ట్ చేశారు. కాగా, నెంబర్ ప్లేట్ లేని ఆటోను సైతం ట్రాక్ చేసి నిందితులను గుర్తించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
