TDP Leader Arrest: అర్థరాత్రి హైడ్రామా.. టీడీపీ మరో ముఖ్య నేత అరెస్ట్.. ఎక్కడికి తీసుకెళ్లారంటే..?
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై నోరు పారేసుకున్న పాపానికి ముచ్చటగా ఐదో సారి అర్ధరాత్రి పూట ఆ ప్రజా ప్రతినిధిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఖాకీలు.
TDP Leader Kuna Ravi Kumar Arrest: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై నోరు పారేసుకున్న పాపానికి ముచ్చటగా ఐదో సారి అర్ధరాత్రి పూట ఆ ప్రజా ప్రతినిధిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఖాకీలు. ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో గత అర్ధరాత్రి మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ను అరెస్టు చేసారు పోలీసులు. శ్రీకాకుళం టౌన్ శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి నివాసంలో నిద్రిస్తుండగా పోలీసులు ఇంటి చుట్టూ మోహరించిన మరీ అదుపులోకి తీసుకున్నారు. శనివారం పది గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చి పోలీసులపై దురుసుగా వ్యవహరించారని, టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు సమాచారం. రవికుమార్ ను అరెస్టు చేసి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. అర్థ రాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ ఇంట్లో వున్నారన్న పక్కా సమాచారంతో అరెస్టు చేసిన పోలీసులు. అయితే ఇలా అర్ధ రాత్రి పూట వందల మంది పోలీసులతో ఇళ్లల్లోకి చొరబడి అరెస్టులు చేయడంపై ఆ కుటుంబం సభ్యులు మండి పడుతున్నారు.
Read Also….