AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: వయస్సు అనేది ఒక నెంబర్‌ మాత్రమే.. నా స్పీడ్‌ తట్టుకోగలరా? వైసీపీ సర్కారుపై చంద్రబాబు సెటైర్లు

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు చంద్రబాబు. తాడికొండ నియోజక వర్గంలో రోడ్‌షో నిర్వహించిన చంద్రబాబు.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్‌ వై నాట్ 175 అంటున్నారు. తాము పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయబోతున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: వయస్సు అనేది ఒక నెంబర్‌ మాత్రమే.. నా స్పీడ్‌ తట్టుకోగలరా? వైసీపీ సర్కారుపై చంద్రబాబు సెటైర్లు
Chandrababu Naidu
Basha Shek
|

Updated on: Apr 28, 2023 | 6:58 AM

Share

చాలామంది నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు. నా స్పీడ్ తట్టుకోగలరా అని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాకు వయస్సు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అన్నారాయన. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు చంద్రబాబు. తాడికొండ నియోజక వర్గంలో రోడ్‌షో నిర్వహించిన చంద్రబాబు.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్‌ వై నాట్ 175 అంటున్నారు. తాము పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయబోతున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటుకు నోటు రాజకీయం పోతే స్వచ్చమైన రాజకీయాలు వస్తాయన్న ఆయన.. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మూడు రాజధానులు అంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎందుకు ఈ ప్రస్థావన తీసుకు రాలేదన్నారు. అమరావతి రాజధానే అన్న చంద్రబాబు మూడు రాజధానులు అన్నది జరగబోదన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో ఐదారు ఎకరాల భూమి కొనే వారు. కాని ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం తాము తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు రేట్లు అసాధారణ స్థాయిలో పెరిగేలా చేశాయని అన్నారు చంద్రబాబు.

‘రాష్ట్రంలో జగన్ మాటలు విని జనం మోసపోయారు. చివరికి అమరావతి రాజధాని ఉన్న తాడికొండలో కూడా జగన్ పార్టీని గెలిపించారు. ఇక్కడే ఇళ్లు కట్టుకున్నానని చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అమరావతికి కులం ముద్ర వేసి తప్పుడు ప్రచారం చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని మరో అబద్ధం చెప్పారు. అమరావతిలో అవినీతి జరిగిందని మళ్లీ తప్పుడు ప్రచారం చేశారు’ అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్