Chandrababu: రైతులను ఆదుకోవడంలో విఫలం.. వైసీపీ సర్కారుపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు
. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు
ఏపీ రాజకీయం అకాలవర్షాల చుట్టూ తిరుగుతోంది. రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని చంద్రబాబు విమర్శిస్తే.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కౌంటర్లు వేశారు మంత్రులు. కమీషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు చంద్రబాబు . కాగా నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చాగల్లు మండలంలోని ఐ పంగిడి , చాగల్లు, ఊనగట్ల, బ్రాహ్మణగూడెం ప్రాంతాల్లో పర్యటించి.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అయితే చంద్రబాబు విమర్శలపై అధికార పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు. రైతుల విషయంలో చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు మంత్రి కారుమూరి.
ఇక చంద్రబాబు ఎప్పటిలా అవాస్తవాలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి. ఇక మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మొత్తానికి అధికార విపక్షాల మధ్య పంట నష్టం.. రైతులను ఆదుకునే అంశాలు విమర్శనాస్త్రాలుగా మారిపోయాయి. మరోవైపు చంద్రబాబు తాను పర్యటన చేస్తున్న తర్వాతనే ప్రభుత్వం నుంచి స్పందన మొదలైందన్నారు. అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని.. ప్రీమియం చెల్లించలేదని చంద్రబాబు ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..