Andhra Pradesh: తుఫాన్ గండం.! మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
వాయుగుండం దాదాపు ఉత్తరం వైపు పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించవచ్చునని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు వర్షాలు..
శుక్రవారం తమిళనాడు తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 1.5 కి.మీ, 5.8 కి.మీ ఎత్తులో ఉంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కేంద్రీకృతమై ఉంది. అది కాస్తా శనివారం(మే 6) మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించినది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో మే 8న ఉదయం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ దిశగా కదిలి మే 9 అనగా మంగళవారం బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం దాదాపు ఉత్తరం వైపు పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించవచ్చునని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
-
ఉత్తర కోస్తాంధ్రా, యానాం:
————————————————–
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
-
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
————————————————
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
-
రాయలసీమ:-
————————————————–
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది