Andhra Pradesh: ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ.. మొత్తం 50 మందిని..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ కేవీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీతో పాటు పోస్టింగ్‌ వచ్చిన అధికారులు తక్షణం విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశించారు. ఒంగోలుకు కూడా కొత్త డీఎస్పీని వేశారు. ఒంగోలు డీఎస్పీ పోస్టింగ్‌పై మాజీ మంత్రి బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...

Andhra Pradesh: ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ.. మొత్తం 50 మందిని..
Andhra Pradesh
Follow us
Narender Vaitla

|

Updated on: May 06, 2023 | 6:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ కేవీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీతో పాటు పోస్టింగ్‌ వచ్చిన అధికారులు తక్షణం విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశించారు. బదిలీల్లో భాగంగా ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామి రెడ్డిని నియమించారు. ఇక అంతకు ముందు ఒంగోలు డీఎస్పీగా చేరిన అశోక్‌ వర్దన్‌ను రెండు రోజుల్లోనే బదిలీ చేయడం గమనార్హం.

ఇదిలా ఉంంటే కనిగిరి డీఎస్పీగా రామరాజును నియమించారు. అలాగే అమలాపురం ఎస్డీపీఓగా అంబికా ప్రసాద్‌, ఏసీబీ డీఎస్పీగా ఉన్న ఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను రామచంద్రాపురం ఎస్డీపీఓగా, మార్కాపురం డీఎస్పీ కిషోర్‌ కుమార్‌ను రాజమహేంద్రవరం ఈస్ట్‌ డీఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న 24మంది డీఎస్పీలను వేర్వేరు చోట్ల పోస్టింగ్‌ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక విజయనగరంలో కొత్త డీఎస్పీగా ఆర్‌ గోవిందరావుకు పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడ ఇప్పటి వరకు విధులు నిర్వర్తిస్తున్న కాళిదాసును నార్త్‌ కోస్టల్‌ సెక్యూరిటీ డీఎస్పీగా బదిలీ చేశారు.

ఇవి కూడా చదవండి

బదిలీ అయిన మొత్తం డీఎస్పీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..