Tiger: పల్నాడును హడలెత్తిస్తున్న పెద్ద పులులు.. క్షణ క్షణం భయం గుప్పిట్లో స్థానికులు..
మొదటి సారి దుర్గి మండలం గజాపురంలో ఆవుపై దాడి చేసి చంపేశాయి. అదే విధంగా కాకిరాల, రాజా నగరంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు పులులు సంచరించినట్లు పగ్ మార్క్స్ గుర్తించారు. అయితే అవి ఎటు వెళ్లిపోయాయో.. ఎక్కడ తిరుగుతున్నాయో అర్ధం కావడం లేదు. అధికారులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
క్షణక్షణం.. భయం భయం. పులులు ఎటువైపు నుంచి వచ్చి నుంచి దాడి చేస్తాయోనన్న టెన్షన్. కనిపించకుండా తిరుగుతున్న పులులు.. పల్నాడు ప్రజలను వణికిస్తున్నాయి. పాదముద్రలు కనిపిస్తున్నాయి.. కానీ పులి జాడలు మాత్రం దొరకడం లేదు. కెమెరాల్లోనూ ఇంత వరకు ఎలాంటి పులి ఆనవాళ్లు రికార్డ్ కాలేదు. దీంతో పులుల కదలికలు కనిపెట్టడం.. ఫారెస్ట్ అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. పులుల ట్రేసింగ్‌పై ఇప్పటికే మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజర్లుతో DFO మీటింగ్ నిర్వహించారు. బోన్ల ఏర్పాటుతో పాటు.. ట్రాప్ కెమెరాలు ఎన్ని, ఎక్కడెక్కడ ఏర్పాటు చెయ్యాలనే దానిపై చర్చించారు.
వినుకొండ రేంజ్ పరిధిలో పది ట్రాప్ కెమెరాలను అటవీ సిబ్బంది ఏర్పాటు చేసి పులుల కదలికలను గమనిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆ ట్రాప్ కెమెరాల్లో పులుల జాడ కనిపించలేదు. మరొక వైపు సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా పులులు తారస పడితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పులి సంచరించిన దాఖలులు లేవు. మొదటి సారి దుర్గి మండలం గజాపురంలో ఆవుపై దాడి చేసి చంపేశాయి. అదే విధంగా కాకిరాల, రాజా నగరంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు పులులు సంచరించినట్లు పగ్ మార్క్స్ గుర్తించారు. అయితే అవి ఎటు వెళ్లిపోయాయో.. ఎక్కడ తిరుగుతున్నాయో అర్ధం కావడం లేదు. అధికారులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
పులుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకా పులుల జాడ తెలియక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు పల్నాడు జిల్లా ప్రజలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. భయటకు పోవాలంటే జంకుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..